Melumele ninnum joosi mechchidi nenu

మేలుమేలే నిన్నుఁ జూచి మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలుమేలే నిన్నుఁ జూచి మెచ్చితి నేను
నా లాగు లింతకంటె నన్నుఁ జూడు మిఁకను

(॥మేలు॥)
చన్నులను దాఁపురాలు సరసాన గాఁపురాలు
పన్నుక యెంతసేసేవే పతితోను
కన్నులను జూగరాలు కాఁగిటికి వేగిరాలు
చిన్నదాన వెంతేసి నేర్చితివే నీవు

(॥మేలు॥)
చెలులతో మంతనాలు చేసన్నల బొంతనాలు
వెలయించే వేమిటికే విభునివొద్ద
కలసేటి కారణాలు పులకల దోరణాలు
కలగె నీకత లెట్టు గడిఇంచుకొంటివే

(॥మేలు॥)
చదురుల బిత్తరాలు సమరతి తత్తరాలు
వెదచల్లేవవునే శ్రీవేంకటేశుతో
వుదుటుల పోతరాలు వుడివొని కాతరాలు
అదన నన్నియ నీకు నమరెనే నేఁడు

(||pallavi||)
melumele ninnum̐ jūsi mĕchchidi nenu
nā lāgu liṁtagaṁṭĕ nannum̐ jūḍu mim̐kanu

(||melu||)
sannulanu dām̐purālu sarasāna gām̐purālu
pannuga yĕṁtaseseve padidonu
kannulanu jūgarālu kām̐giḍigi vegirālu
sinnadāna vĕṁtesi nersidive nīvu

(||melu||)
sĕlulado maṁtanālu sesannala bŏṁtanālu
vĕlayiṁche vemiḍige vibhunivŏdda
kalaseḍi kāraṇālu pulagala doraṇālu
kalagĕ nīgada lĕṭṭu gaḍiiṁchugŏṁṭive

(||melu||)
sadurula bittarālu samaradi tattarālu
vĕdasallevavune śhrīveṁkaḍeśhudo
vuduḍula podarālu vuḍivŏni kādarālu
adana nanniya nīgu namarĕne nem̐ḍu