Melumele nee pagadu mechchidi mimdaramunu

మేలుమేలే నీ పగటు మెచ్చితి మిందరమును
Language

(॥పల్లవి॥)
మేలుమేలే నీ పగటు మెచ్చితి మిందరమును
యేలాటాలాడేవు కడు నెంతదంటవే

(॥మేలు॥)
జక్కవలవంటివి నీచన్ను లతఁ డంటెనంటా
పక్కన జంకించే వెంతపంతగత్తేవే
తొక్కెఁ బాదమంటా నూఁదుచు గోర నదిమేవు
చిక్కించుక యెటువంటిచేఁతలాఁడివే

(॥మేలు॥)
మొగము చూచితేనే మోహించెను నీకంటాను
తగులనాడే వెంతయాతరిదానవే
వెగటునఁ దామరను వేసెనంటా బులిసేవు
యెగసక్కేలను నీ వెంతకతకారివే

(॥మేలు॥)
ఆసతో శ్రీవేంకటేశుఁ డట్టె నిన్నుఁ గూడెనంటా
వేసాలుసేసే వెంతవిత్తరాలవే
బాసతో నలమేల్మంగపతి యీతఁడు మమ్మేలె
నీసుద్దులే చెప్పే వెంతనెరజాణవే

(||pallavi||)
melumele nī pagaḍu mĕchchidi miṁdaramunu
yelāḍālāḍevu kaḍu nĕṁtadaṁṭave

(||melu||)
jakkavalavaṁṭivi nīsannu ladam̐ ḍaṁṭĕnaṁṭā
pakkana jaṁkiṁche vĕṁtabaṁtagatteve
tŏkkĕm̐ bādamaṁṭā nūm̐dusu gora nadimevu
sikkiṁchuga yĕḍuvaṁṭisem̐talām̐ḍive

(||melu||)
mŏgamu sūsidene mohiṁchĕnu nīgaṁṭānu
tagulanāḍe vĕṁtayādaridānave
vĕgaḍunam̐ dāmaranu vesĕnaṁṭā bulisevu
yĕgasakkelanu nī vĕṁtagadagārive

(||melu||)
āsado śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ninnum̐ gūḍĕnaṁṭā
vesālusese vĕṁtavittarālave
bāsado nalamelmaṁgabadi yīdam̐ḍu mammelĕ
nīsuddule sĕppe vĕṁtanĕrajāṇave