Melumeemdaa mele kaaga mera mera limka nele

మేలుమీఁదా మేలే కాక మెర మెర లిఁక నేలే
Language

(॥పల్లవి॥)
మేలుమీఁదా మేలే కాక మెర మెర లిఁక నేలే
యేలినవానితోడి దిది యేఁటిదే

(॥మేలు॥)
కారుకమ్మేనీనవ్వులు కన్నులకొలుకులకుఁ
నీరీతి నెఱ్ఱఁదనము లేల తెచ్చెనే
మోరకించి నీవిభుడు మోవితేనె లానీ నదే
నేర మాయనా యింతలో నీ విదేఁటిదే

(॥మేలు॥)
పలుకులు తేనియలు పైపై నాలికకొనఁ
నెలమిఁ గారపుమాఁట లేల వూరీనే
పెలుచునీరమణుఁడు ప్రియములు నీకుఁ జెప్పుట
కొలఁదిఁ బడదాయనా గుణ మేఁటిదే

(॥మేలు॥)
మెత్తనిచిగురుఁజేయి మించినకొనగోళ్ళకు
యెత్తి వాండ్లు మొనలు నేల చూపీనే
యిత్తల శ్రీ వేంకటేశఁ డిదివో నిన్నుఁగూడె
వొత్తులే వొగ రాయవా వొర పేఁటిదే

(||pallavi||)
melumīm̐dā mele kāga mĕra mĕra lim̐ka nele
yelinavānidoḍi didi yem̐ṭide

(||melu||)
kārugammenīnavvulu kannulagŏlugulagum̐
nīrīdi nĕṭram̐danamu lela tĕchchĕne
moragiṁchi nīvibhuḍu movidenĕ lānī nade
nera māyanā yiṁtalo nī videm̐ṭide

(||melu||)
palugulu teniyalu paibai nāligagŏnam̐
nĕlamim̐ gārabumām̐ṭa lela vūrīne
pĕlusunīramaṇum̐ḍu priyamulu nīgum̐ jĕppuḍa
kŏlam̐dim̐ baḍadāyanā guṇa mem̐ṭide

(||melu||)
mĕttanisigurum̐jeyi miṁchinagŏnagoḽḽagu
yĕtti vāṁḍlu mŏnalu nela sūbīne
yittala śhrī veṁkaḍeśham̐ ḍidivo ninnum̐gūḍĕ
vŏttule vŏga rāyavā vŏra pem̐ṭide