Melume lauraura mechchidira ne ninnu

మేలుమే లౌరౌర మెచ్చితిర నే నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలుమే లౌరౌర మెచ్చితిర నే నిన్ను
ఆలించి మన్నించు మన్నిటా నన్ను

(॥మేలు॥)
అలుకలకు మూలమా ఆయంబులంటేది
చలములకు మూలమా సరియాఁకలు
పలుకులకు మూలమా పైకొనుచు నవ్వేది
నెలవులకు మూలమా నివ్వెరగులు

(॥మేలు॥)
జంకెలకు మూలమా చనవు లిటు మెరసేది
మంకులకు మూలమా మచ్చరములు
లంకెలకు మాలమా లావుననే పెనఁగేది
అంకెరతిమూలమా అడియాసలు

(॥మేలు॥)
కూడుటకు మూలమా గుట్టుతోఁ గొసరేది
వాడికకు మూలమా వసమౌటలు
యీడనె శ్రీవేంకటేశ నను నేలితివి
జోడౌట మూలమా చూపులప్రియములు

(||pallavi||)
melume lauraura mĕchchidira ne ninnu
āliṁchi manniṁchu manniḍā nannu

(||melu||)
alugalagu mūlamā āyaṁbulaṁṭedi
salamulagu mūlamā sariyām̐kalu
palugulagu mūlamā paigŏnusu navvedi
nĕlavulagu mūlamā nivvĕragulu

(||melu||)
jaṁkĕlagu mūlamā sanavu liḍu mĕrasedi
maṁkulagu mūlamā machcharamulu
laṁkĕlagu mālamā lāvunane pĕnam̐gedi
aṁkĕradimūlamā aḍiyāsalu

(||melu||)
kūḍuḍagu mūlamā guṭṭudom̐ gŏsaredi
vāḍigagu mūlamā vasamauḍalu
yīḍanĕ śhrīveṁkaḍeśha nanu nelidivi
joḍauḍa mūlamā sūbulapriyamulu