మేలుకు మేలేకాక మిక్కుటమేలా
(॥పల్లవి॥)
మేలుకు మేలేకాక మిక్కుటమేలా
కోలుముందై మీఁద గుట్టుసేయనేలా
(॥॥)
పచ్చిగా మగువ నీతోఁ బలుకఁ గాను
అచ్చగా నూఁకొందు గాక అలయనేలా
ముచ్చట నాపె నీకు మొక్కఁ గాను
యిచ్చగించుకొంటగాక యిఁక సిగ్గులేలా
(॥॥)
ననుపున నాకె నీతో నవ్వఁ గాను
చనువు లిచ్చుటగాక జాగులేలా
వినయముతో నిన్ను వేఁడుకోఁ గాను
యెనుయుటగాక మరి యెలయింపులేలా
(॥॥)
ప్రియమున నీతో నాపె పెనఁగఁగాను
దయతోఁ గూడుటగాక తాలిములేలా
క్రియతోఁ గాఁగలించఁగా శ్రీ వేంకటేశా
నయమే మంచిదిగాక నాలితనములేలా
(||pallavi||)
melugu melegāga mikkuḍamelā
kolumuṁdai mīm̐da guṭṭuseyanelā
(||||)
pachchigā maguva nīdom̐ balugam̐ gānu
achchagā nūm̐kŏṁdu gāga alayanelā
muchchaḍa nābĕ nīgu mŏkkam̐ gānu
yichchagiṁchugŏṁṭagāga yim̐ka siggulelā
(||||)
nanubuna nāgĕ nīdo navvam̐ gānu
sanuvu lichchuḍagāga jāgulelā
vinayamudo ninnu vem̐ḍugom̐ gānu
yĕnuyuḍagāga mari yĕlayiṁpulelā
(||||)
priyamuna nīdo nābĕ pĕnam̐gam̐gānu
dayadom̐ gūḍuḍagāga tālimulelā
kriyadom̐ gām̐galiṁcham̐gā śhrī veṁkaḍeśhā
nayame maṁchidigāga nālidanamulelā