మేలుకు మేలేకాక మెరమెర లేమిటికే
(॥పల్లవి॥)
మేలుకు మేలేకాక మెరమెర లేమిటికే
పోలికలు మీకుఁ దగు పొందులెల్లాఁ జేయవే
(॥మేలు॥)
కరుణించి యాతఁడు కలువల వేయఁగాను
శిరసువంచుకోనేలే చెలియనీకు
సరసములాడి నిన్ను సారెఁ గరఁగించఁగాను
తెరమాఁటా మాఁటలనే తేనెలెంత చల్లేవే
(॥మేలు॥)
చుట్టరికములు నీతో చూచి చెప్పి తగులఁగా
గుట్టుతో నుందానవేమే కోమలి నీవు
నెట్టుకొని యాతఁడు నిన్నుఁజేరి చెనకఁగా
వట్టి సిగ్గుతోనేల వలపుదాఁచేవే
(॥మేలు॥)
కోరి వేఁడి నీతోను కొచ్చి కొచ్చి నవ్వఁగాను
వూరకే వుండఁ గ నేలే వువిద నీకు
యారీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటా నిన్నుమన్నించె
తారుకాణ వచ్చితే నెందాఁకా వెరగందేవే
(||pallavi||)
melugu melegāga mĕramĕra lemiḍige
poligalu mīgum̐ dagu pŏṁdulĕllām̐ jeyave
(||melu||)
karuṇiṁchi yādam̐ḍu kaluvala veyam̐gānu
śhirasuvaṁchugonele sĕliyanīgu
sarasamulāḍi ninnu sārĕm̐ garam̐giṁcham̐gānu
tĕramām̐ṭā mām̐ṭalane tenĕlĕṁta salleve
(||melu||)
suṭṭarigamulu nīdo sūsi sĕppi tagulam̐gā
guṭṭudo nuṁdānaveme komali nīvu
nĕṭṭugŏni yādam̐ḍu ninnum̐jeri sĕnagam̐gā
vaṭṭi siggudonela valabudām̐seve
(||melu||)
kori vem̐ḍi nīdonu kŏchchi kŏchchi navvam̐gānu
vūrage vuṁḍam̐ ga nele vuvida nīgu
yārīdi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā ninnumanniṁchĕ
tārugāṇa vachchide nĕṁdām̐kā vĕragaṁdeve