Melugonave neelameghavarnumdaa

మేలుకొనవే నీలమేఘవర్ణుఁడా
Language

(॥పల్లవి॥)
మేలుకొనవే నీలమేఘవర్ణుఁడా
వేళ దప్పకుండాను శ్రీ వేంకటేశుఁడా

(॥మేలు॥)
మంచముపై నిద్ర దేఱ మల్లెల వేసేరు
ముంచి తురుము ముడువ మొల్లల వేసేరు
కంచము పొత్తారగించ కలువల వేసేరు
పించెపు చిక్కుదేఱ సంపెంగల వేసేరు

(॥మేలు॥)
కలసిన కాఁక దేఱ గన్నేరుల వేసేరు
వలపులు రేఁగి విరజాజుల వేసేరు
చలువగా వాడుదేఱ జాజుల వేసేరు
పులకించ గురువిందపూవుల వేసేరు

(॥మేలు॥)
తమి రేఁగ గోపికలు తామరల వేసేరు
చెమటార మంచి తులసిని వేసేరు
అమర శ్రీ వేంకటేశ యలమేలుమంగ నీకు
మమత పన్నీటితో చేమంతుల వేసేరు

(||pallavi||)
melugŏnave nīlameghavarṇum̐ḍā
veḽa dappaguṁḍānu śhrī veṁkaḍeśhum̐ḍā

(||melu||)
maṁchamubai nidra deṟa mallĕla veseru
muṁchi turumu muḍuva mŏllala veseru
kaṁchamu pŏttāragiṁcha kaluvala veseru
piṁchĕbu sikkudeṟa saṁpĕṁgala veseru

(||melu||)
kalasina kām̐ka deṟa gannerula veseru
valabulu rem̐gi virajājula veseru
saluvagā vāḍudeṟa jājula veseru
pulagiṁcha guruviṁdabūvula veseru

(||melu||)
tami rem̐ga gobigalu tāmarala veseru
sĕmaḍāra maṁchi tulasini veseru
amara śhrī veṁkaḍeśha yalamelumaṁga nīgu
mamada pannīḍido semaṁtula veseru