Melugo shrmgaararaaya medimadanagobaalaa

మేలుకో శృంగారరాయ మేటిమదనగోపాలా
Language

(॥పల్లవి॥)
మేలుకో శృంగారరాయ మేటిమదనగోపాలా
మేలుకోవే నా పాల మించిననిధానమా

(॥మేలుకో॥)
సందడించే గోపికల జవ్వన వనములోన
కందువఁ దిరిగే మదగజమవు
యిందుముఖి సత్య భామహృదయపద్మములోని
గందము మరిగినట్టి గండుఁదుమ్మిదా

(॥మేలుకో॥)
గతి గూడి రుకిమిణికౌఁగిటపంజరములో
రతి ముద్దుగురిసేటి రాచిలుకా
సతులు పదారువేల జంటకన్నుఁగలువల
కితవై పొడమిన నా యిందు బింబమా

(॥మేలుకో॥)
వరుసఁ గొలనిలోనివారి చన్నుఁగొండలపై
నిరతి వాలిన నా నీలమేఘమా
సిరినురమున మోచి శ్రీవేంకటాద్రిమీఁద
గరిమ వరము లిచ్చే కల్పతరువా

(||pallavi||)
melugo śhṛṁgārarāya meḍimadanagobālā
melugove nā pāla miṁchinanidhānamā

(||melugo||)
saṁdaḍiṁche gobigala javvana vanamulona
kaṁduvam̐ dirige madagajamavu
yiṁdumukhi satya bhāmahṛdayabadmamuloni
gaṁdamu mariginaṭṭi gaṁḍum̐dummidā

(||melugo||)
gadi gūḍi rugimiṇigaum̐giḍabaṁjaramulo
radi mudduguriseḍi rāsilugā
sadulu padāruvela jaṁṭagannum̐galuvala
kidavai pŏḍamina nā yiṁdu biṁbamā

(||melugo||)
varusam̐ gŏlanilonivāri sannum̐gŏṁḍalabai
niradi vālina nā nīlameghamā
sirinuramuna mosi śhrīveṁkaḍādrimīm̐da
garima varamu lichche kalbadaruvā