(॥పల్లవి॥)
మేలుగాని మేకులు నీ
వాలుఁజూపు లట్టె వంచేవు
(॥మేలు॥)
చెంది ని న్నాతఁడు చెనకఁగా నేమె
కందువ లంటక కసరేవు
యిందులోనే కొన్ని యెమ్మెలా, వీడె
మంది యిమ్మనఁగానే అలసేవు
(॥మేలు॥)
పేరుకొని నిన్నుఁ బిలువఁగా నవునే
కూరిమిఁ బలుకక కొంకేవు
నేరుచుకొంటివే నిట్లు పతి
గోర గీరితేనే గొణఁగేవు
(॥మేలు॥)
నిండుఁగౌఁగిటనే నించఁగా చనుఁ
గొండల నొ త్తక గునిసేవు
అండనే శ్రీవేంకటాధీశుఁడు గూడి
మెండుకొనఁగానే మించేవు
(||pallavi||)
melugāni megulu nī
vālum̐jūbu laṭṭĕ vaṁchevu
(||melu||)
sĕṁdi ni nnādam̐ḍu sĕnagam̐gā nemĕ
kaṁduva laṁṭaga kasarevu
yiṁdulone kŏnni yĕmmĕlā, vīḍĕ
maṁdi yimmanam̐gāne alasevu
(||melu||)
perugŏni ninnum̐ biluvam̐gā navune
kūrimim̐ balugaga kŏṁkevu
nerusugŏṁṭive niṭlu padi
gora gīridene gŏṇam̐gevu
(||melu||)
niṁḍum̐gaum̐giḍane niṁcham̐gā sanum̐
gŏṁḍala nŏ ttaga gunisevu
aṁḍane śhrīveṁkaḍādhīśhum̐ḍu gūḍi
mĕṁḍugŏnam̐gāne miṁchevu