Meludaanaraa ne neegu melu daanaraa, yela yemsevu imtigi raaraa

మేలుదానరా నే నీకు మేలు దానరా, యేల యేఁచేవు ఇంటికి రారా
Language

(॥పల్లవి॥)
మేలుదానరా నే నీకు మేలు దానరా, యేల యేఁచేవు ఇంటికి రారా
మేలుదానరా కొండలయ్య మేలుదానరా, అప్పకొండ మేలుదానరా

(॥మేలు॥)
కోమలపు నాచన్నులు నీకు గురుతు కానిక లివిరా
చేముట్టి చేకొనరా, నీమోము చూపిమోవి యియ్యరా

(॥మేలు॥)
తనువుపై నీచేఁతలు నిన్నుఁ దలపించు నే పొద్దును
చెనకుచు నిండుఁగాఁగిటనాతోమనసిచ్చిమాటలాడరా

(॥మేలు॥)
పచ్చిగాఁగ నన్నుఁగూడితి నీ భావమునాలోఁజిక్కెను
మచ్చిక శ్రీవేంకటేశుఁడ నీపచ్చడము పయిఁ గప్పరా

(||pallavi||)
meludānarā ne nīgu melu dānarā, yela yem̐sevu iṁṭigi rārā
meludānarā kŏṁḍalayya meludānarā, appagŏṁḍa meludānarā

(||melu||)
komalabu nāsannulu nīgu gurudu kāniga livirā
semuṭṭi segŏnarā, nīmomu sūbimovi yiyyarā

(||melu||)
tanuvubai nīsem̐talu ninnum̐ dalabiṁchu ne pŏddunu
sĕnagusu niṁḍum̐gām̐giḍanādomanasichchimāḍalāḍarā

(||melu||)
pachchigām̐ga nannum̐gūḍidi nī bhāvamunālom̐jikkĕnu
machchiga śhrīveṁkaḍeśhum̐ḍa nībachchaḍamu payim̐ gapparā