Melu neegamte naagenu mechchidi nenu

మేలు నీకంటే నాకెను మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలు నీకంటే నాకెను మెచ్చితి నేను
తాలిమి గలదీ నౌను దయగల దవును

(॥మేలు॥)
అంగన నీకు నేఁడు అప్పణ ఇయ్యఁగఁబోలు
చెంగక మాయింటికి విచ్చేసితి విటే
అంగవించి అందువంక అన్నిటా వెరపుదేరి
రంగుగా యీడ నిట్టే రచ్చసేసే విపుడు

(॥మేలు॥)
ఆపె నీకు నేరిపిన ఆసుద్దులే కాఁబోలు
పైపై నన్ను వేఁడుకొని పాలించితివి
తీపులుగా నందులకే తిరమైన సొమ్ము లిచ్చి
చేపట్టి యందరుఁ జూడ సేసవెట్టే విపుడు

(॥మేలు॥)
నీసతి నీవెంట వచ్చి నెపము సేయఁగఁబోలు
వాసితోడ నన్నుఁ గూడి వలపంచితి
ఆసతో శ్రీవేంకటేశ అందుకే నన్ను మన్నించి
వోసరించ కిద్దరు నావొద్దనున్నా రిపుడు

(||pallavi||)
melu nīgaṁṭe nāgĕnu mĕchchidi nenu
tālimi galadī naunu dayagala davunu

(||melu||)
aṁgana nīgu nem̐ḍu appaṇa iyyam̐gam̐bolu
sĕṁgaga māyiṁṭigi vichchesidi viḍe
aṁgaviṁchi aṁduvaṁka anniḍā vĕrabuderi
raṁgugā yīḍa niṭṭe rachchasese vibuḍu

(||melu||)
ābĕ nīgu neribina āsuddule kām̐bolu
paibai nannu vem̐ḍugŏni pāliṁchidivi
tībulugā naṁdulage tiramaina sŏmmu lichchi
sebaṭṭi yaṁdarum̐ jūḍa sesavĕṭṭe vibuḍu

(||melu||)
nīsadi nīvĕṁṭa vachchi nĕbamu seyam̐gam̐bolu
vāsidoḍa nannum̐ gūḍi valabaṁchidi
āsado śhrīveṁkaḍeśha aṁduge nannu manniṁchi
vosariṁcha kiddaru nāvŏddanunnā ribuḍu