మేలు నీ జాణతనము మెచ్చిరి సతులిందరు
(॥పల్లవి॥)
మేలు నీ జాణతనము మెచ్చిరి సతులిందరు
యేలికవంటాఁ జేరితే నిక్కువ లంటేవు
(॥॥)
నిమ్మపండ్లు గానుకగా నెలత నీ కియ్యరాఁగా
ఇమ్ముల నాపెచన్నులు యేల పట్టేవు
నెమ్మి మొకదాకిరితో నిన్నేమీ ననకుండితే
సమ్మతించెనంటా నెంత సంతోసించుకొనేవు
(॥॥)
తరుణి సూడిదెగాను తామర నీ కియ్య రాగా
కరకమలమేల గక్కనఁ బట్టేవు
శిరుసువంచు కందుకు సిగ్గుతోడ నుండితేను
కరఁగియున్నదంటాను కాఁగిలించుకొనేవు
(॥॥)
పచ్చిపగడము నీచేపట్టుగా జెలియ్యరాఁగా
ముచ్చటతో సందుసుడి మోవి యానేవు
అచ్చమై శ్రీవేంకటేశ అందు కోరుచుకుండితే
ఇచ్చెరిఁగి కూడెనంటా నెంత గారవించేవు
(||pallavi||)
melu nī jāṇadanamu mĕchchiri saduliṁdaru
yeligavaṁṭām̐ jeride nikkuva laṁṭevu
(||||)
nimmabaṁḍlu gānugagā nĕlada nī kiyyarām̐gā
immula nābĕsannulu yela paṭṭevu
nĕmmi mŏgadāgirido ninnemī nanaguṁḍide
sammadiṁchĕnaṁṭā nĕṁta saṁtosiṁchugŏnevu
(||||)
taruṇi sūḍidĕgānu tāmara nī kiyya rāgā
karagamalamela gakkanam̐ baṭṭevu
śhirusuvaṁchu kaṁdugu siggudoḍa nuṁḍidenu
karam̐giyunnadaṁṭānu kām̐giliṁchugŏnevu
(||||)
pachchibagaḍamu nīsebaṭṭugā jĕliyyarām̐gā
muchchaḍado saṁdusuḍi movi yānevu
achchamai śhrīveṁkaḍeśha aṁdu korusuguṁḍide
ichchĕrim̐gi kūḍĕnaṁṭā nĕṁta gāraviṁchevu