Melu melugaa neevu merayudimta

మేలు మేలుగా నీవు మెరయుటింత
Language

(॥పల్లవి॥)
మేలు మేలుగా నీవు మెరయుటింత
యీలాగు నాకొరకు నింత సేసితివిగా

(॥మేలు ॥)
చెల్లెఁగా లంకలోనికిఁ జెప్పిపుత్తెంచినమాట
మల్లడిగా నల్లహనుమంతునిచేత
వల్లెగాఁ గొండలచేత వారిధి గట్టుట యెంచ
ఇల్లిదె నాకొరకుఁగా నింతసేసితివిగా

(॥మేలు॥)
యెక్కెఁగా నీచలము నింద్రచంద్రాదులఁ గూడి
చక్కఁగా రావణు నట్టె చంపినవంక
పక్కనను వనచరబలము గూర్చుట యెంత
యెక్కువ నాకొరకుఁగా నింతసేసితివిగా

(॥మేలు॥)
అందెఁగా నీకోరిక నన్నలమీ కూడినవంక
అందరుఁ జూడఁగా నీ వయోద్యలోన
వొందిరి శ్రీవేంకటేశ వురమున మోచితివి
ఇందునే నాకొరఁకుగా నింతసేసితివిగా

(||pallavi||)
melu melugā nīvu mĕrayuḍiṁta
yīlāgu nāgŏragu niṁta sesidivigā

(||melu ||)
sĕllĕm̐gā laṁkalonigim̐ jĕppibuttĕṁchinamāḍa
mallaḍigā nallahanumaṁtuniseda
vallĕgām̐ gŏṁḍalaseda vāridhi gaṭṭuḍa yĕṁcha
illidĕ nāgŏragum̐gā niṁtasesidivigā

(||melu||)
yĕkkĕm̐gā nīsalamu niṁdrasaṁdrādulam̐ gūḍi
sakkam̐gā rāvaṇu naṭṭĕ saṁpinavaṁka
pakkananu vanasarabalamu gūrsuḍa yĕṁta
yĕkkuva nāgŏragum̐gā niṁtasesidivigā

(||melu||)
aṁdĕm̐gā nīgoriga nannalamī kūḍinavaṁka
aṁdarum̐ jūḍam̐gā nī vayodyalona
vŏṁdiri śhrīveṁkaḍeśha vuramuna mosidivi
iṁdune nāgŏram̐kugā niṁtasesidivigā