మేలు మేలు యివీఁ గొన్ని మించె బూమిపైఁ గొత్తలు
(॥పల్లవి॥)
మేలు మేలు యివీఁ గొన్ని మించె బూమిపైఁ గొత్తలు
సోలినున్న మిమ్మిద్దరిఁ జూచి వేడుకయ్యీని
(॥మేలు॥)
చెలరేఁగిచెలరేఁగి చెప్పీ నాపె సుద్దులు
పొలసిపొలసి కడుఁ బొందు సేసీని
తలఁచుకతలఁచుక గత నూడిగాలు సేసీ
యెలమి నీపెపొందు లినుమడించఁబోయి
(॥మేలు॥)
తగిలితగిలి నీపైఁ దమకము నించీని
మొగమెత్తి మొగమెత్తి మోము చూచీని
నగినగి సారెసారె నాఁటించీఁ జన్నులు
మగువవలపు లినుమడిగాఁబోలును
(॥మేలు॥)
పెనఁగిపెనఁగి నిన్నుఁ బ్రేమఁ గాఁగిలించీని
తనిసితనిసి నిన్నుఁదగ మెచ్చీని
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
నని చిద్దరివలపూ యినుమడిగాఁబోలు
(||pallavi||)
melu melu yivīm̐ gŏnni miṁchĕ būmibaim̐ gŏttalu
solinunna mimmiddarim̐ jūsi veḍugayyīni
(||melu||)
sĕlarem̐gisĕlarem̐gi sĕppī nābĕ suddulu
pŏlasibŏlasi kaḍum̐ bŏṁdu sesīni
talam̐sugadalam̐suga gada nūḍigālu sesī
yĕlami nībĕbŏṁdu linumaḍiṁcham̐boyi
(||melu||)
tagilidagili nībaim̐ damagamu niṁchīni
mŏgamĕtti mŏgamĕtti momu sūsīni
naginagi sārĕsārĕ nām̐ṭiṁchīm̐ jannulu
maguvavalabu linumaḍigām̐bolunu
(||melu||)
pĕnam̐gibĕnam̐gi ninnum̐ bremam̐ gām̐giliṁchīni
tanisidanisi ninnum̐daga mĕchchīni
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu niṁtalonĕ
nani siddarivalabū yinumaḍigām̐bolu