మేలు మేలు యిందుకె నే మెచ్చితె వీని
(॥పల్లవి॥)
మేలు మేలు యిందుకె నే మెచ్చితె వీని
కే లెత్తెనె మొక్కితేను కినిసీనె తాను
(॥మేలు మేలు॥)
చిన్నఁబోయి వుండఁగాను సెలవి నే నవ్వితేను
మిన్నక నన్నుఁ గోపీంచీ మేలే వీఁడు
యెన్నిక నెవ్వతెచేత నేమి మాఁట బఁడి వచ్చో
కన్న వారిమీఁద నెల్ల కసరీనె తాను
(॥మేలు మేలు॥)
తలవంచు కుండఁగాను దగ్గరి మాఁటాడించితే
మెలుపునఁ దిట్ట వచ్చీ మేలే వీఁడు
వలచి తా న్కెడనో వాదు వెట్టుకొని వచ్చి
పొలసి వొద్దివారితోఁ బోరీనె తాను
(॥మేలు మేలు॥)
గక్కన నొంటి నుండఁగఁ గాఁగిలించుకొంటేను
మిక్కిలి తాఁ బెనఁగీని మేలే వీఁడు
యెక్కడనో శ్రీవకెంటేశుఁ డలిగి వచ్చి
దక్కిన రతులకె తమకించీఁ దాను
(||pallavi||)
melu melu yiṁdugĕ ne mĕchchidĕ vīni
ke lĕttĕnĕ mŏkkidenu kinisīnĕ tānu
(||melu melu||)
sinnam̐boyi vuṁḍam̐gānu sĕlavi ne navvidenu
minnaga nannum̐ gobīṁchī mele vīm̐ḍu
yĕnniga nĕvvadĕseda nemi mām̐ṭa bam̐ḍi vachcho
kanna vārimīm̐da nĕlla kasarīnĕ tānu
(||melu melu||)
talavaṁchu kuṁḍam̐gānu daggari mām̐ṭāḍiṁchide
mĕlubunam̐ diṭṭa vachchī mele vīm̐ḍu
valasi tā nkĕḍano vādu vĕṭṭugŏni vachchi
pŏlasi vŏddivāridom̐ borīnĕ tānu
(||melu melu||)
gakkana nŏṁṭi nuṁḍam̐gam̐ gām̐giliṁchugŏṁṭenu
mikkili tām̐ bĕnam̐gīni mele vīm̐ḍu
yĕkkaḍano śhrīvagĕṁṭeśhum̐ ḍaligi vachchi
dakkina radulagĕ tamagiṁchīm̐ dānu