Melu melu yimdu kitte mechchidi nenu

మేలు మేలు యిందు కిట్టే మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలు మేలు యిందు కిట్టే మెచ్చితి నేను
వాలుక చూపుల నిన్ను వంచెఁగా విభుఁడ

(॥॥)
మందెమేళమైనఁ గాని మగువ నీతొడ యెక్కి
కందువైన మాటలాడీఁగా విభుఁడ
సందడి లోనైనాఁ గానీ చవులుగ మోవి ఇచ్చి
చెంది నీకు సంతోము చేసీఁగా విభుఁడ

(॥॥)
వెక్కసమైనాఁ గానీ వేడుక నీకుఁ బుట్టించి
గక్కన నీతో నవ్వెఁగా విభుఁడ
మొక్కళమైనాఁ గానీ మోహము నీపైఁ జల్లీ
అక్కరతో సరసము లాడేఁగా విభుఁడ

(॥॥)
చుట్ట రికమైనాఁ గానీ సొలసి సొలసి నిన్ను
గట్టి గుబ్బలను వొత్తెఁగా విభుఁడ
ఇట్టి శ్రీ వేంకటేశ ఇటు నన్ను నేలితివి
దట్టముగా తానూఁ గూడి తనిపెఁగా విభుఁడా

(||pallavi||)
melu melu yiṁdu kiṭṭe mĕchchidi nenu
vāluga sūbula ninnu vaṁchĕm̐gā vibhum̐ḍa

(||||)
maṁdĕmeḽamainam̐ gāni maguva nīdŏḍa yĕkki
kaṁduvaina māḍalāḍīm̐gā vibhum̐ḍa
saṁdaḍi lonainām̐ gānī savuluga movi ichchi
sĕṁdi nīgu saṁtomu sesīm̐gā vibhum̐ḍa

(||||)
vĕkkasamainām̐ gānī veḍuga nīgum̐ buṭṭiṁchi
gakkana nīdo navvĕm̐gā vibhum̐ḍa
mŏkkaḽamainām̐ gānī mohamu nībaim̐ jallī
akkarado sarasamu lāḍem̐gā vibhum̐ḍa

(||||)
suṭṭa rigamainām̐ gānī sŏlasi sŏlasi ninnu
gaṭṭi gubbalanu vŏttĕm̐gā vibhum̐ḍa
iṭṭi śhrī veṁkaḍeśha iḍu nannu nelidivi
daṭṭamugā tānūm̐ gūḍi tanibĕm̐gā vibhum̐ḍā