మేలు మేలు యిద్దరై మేకులకే సేవచేసి
(॥పల్లవి॥)
మేలు మేలు యిద్దరై మేకులకే సేవచేసి
గోలతనము మానితి గోవిందనాంచారి
(॥మేలు॥)
చప్పుడుగా దేవునికే సారెఁ బాదములొత్తఁగా
కొప్పు జారెఁ గదవమ్మ గోవిందనాంచారి
ముప్పురి నాతఁడు నీమోము చూచి నవ్వితేను
కుప్పళించె పెంజెమట గోవిందనాంచారి
(॥మేలు॥)
సంగతి నాతనితోడ సరసము లాడఁగాను
కొంగు జాఱెఁ గదవమ్మ గోవిందనాంచారి
అంగవించి పాదముల నాతఁ డెంత యదిమినా
కుంగవుగా నీ చన్నులు గోవిందనాంచారి
(॥మేలు॥)
యెడయక పాఁపసెజ్జ నిద్దరునుఁ బెనఁగుచు
కొడుకుఁ గంటివిగా గోవిందనాంచారి
అడరి శ్రీవేంకటాద్రి నదె గోవిందరాజుతో
గొడుగులనీడ నేగె గోవిందనాంచారి
(||pallavi||)
melu melu yiddarai megulage sevasesi
goladanamu mānidi goviṁdanāṁchāri
(||melu||)
sappuḍugā devunige sārĕm̐ bādamulŏttam̐gā
kŏppu jārĕm̐ gadavamma goviṁdanāṁchāri
muppuri nādam̐ḍu nīmomu sūsi navvidenu
kuppaḽiṁchĕ pĕṁjĕmaḍa goviṁdanāṁchāri
(||melu||)
saṁgadi nādanidoḍa sarasamu lāḍam̐gānu
kŏṁgu jāṟĕm̐ gadavamma goviṁdanāṁchāri
aṁgaviṁchi pādamula nādam̐ ḍĕṁta yadiminā
kuṁgavugā nī sannulu goviṁdanāṁchāri
(||melu||)
yĕḍayaga pām̐pasĕjja niddarunum̐ bĕnam̐gusu
kŏḍugum̐ gaṁṭivigā goviṁdanāṁchāri
aḍari śhrīveṁkaḍādri nadĕ goviṁdarājudo
gŏḍugulanīḍa negĕ goviṁdanāṁchāri