Melu melu yee melumta samdamulu

మేలు మేలు యీ మెలుఁత చందములు
Language

(॥పల్లవి॥)
మేలు మేలు యీ మెలుఁత చందములు
పోలిక లొకటై పొదలీ నీకు

(॥మేలు॥)
తరుణి నిన్నుఁ గడుఁ దగులఁగ నాడీ
తిరమగు వావులు దెలిపీని
గరిమల నినుఁ దమకంబులు రేఁచీ
పొరుగున నెన్నటి పొందో కాని

(॥మేలు॥)
చనవులు సేసుక సరిఁ గూచుండీ
ననుపులు మిగులఁగ నవ్వీని
మనసు గరంగఁగ మర్మము లంటీ
తనియ ది దెంతటి తగులోకాని

(॥మేలు॥)
కొలువులు సేయుచు కుచములు నొరసీ -
సలిగెతో సేసలు చల్లీని
యెలమిని శ్రీవేంకటేశ నన్నేలితి -
విల నినుఁ దా నెపు డెనసీనోకాని

(||pallavi||)
melu melu yī mĕlum̐ta saṁdamulu
poliga lŏgaḍai pŏdalī nīgu

(||melu||)
taruṇi ninnum̐ gaḍum̐ dagulam̐ga nāḍī
tiramagu vāvulu dĕlibīni
garimala ninum̐ damagaṁbulu rem̐sī
pŏruguna nĕnnaḍi pŏṁdo kāni

(||melu||)
sanavulu sesuga sarim̐ gūsuṁḍī
nanubulu migulam̐ga navvīni
manasu garaṁgam̐ga marmamu laṁṭī
taniya di dĕṁtaḍi tagulogāni

(||melu||)
kŏluvulu seyusu kusamulu nŏrasī -
saligĕdo sesalu sallīni
yĕlamini śhrīveṁkaḍeśha nannelidi -
vila ninum̐ dā nĕbu ḍĕnasīnogāni