Melu melu yee keerdi mikkilim gattugomtivi

మేలు మేలు యీ కీర్తి మిక్కిలిఁ గట్టుకొంటివి
Language

(॥పల్లవి॥)
మేలు మేలు యీ కీర్తి మిక్కిలిఁ గట్టుకొంటివి
నీ లాగులెల్లాఁ జూచి నీకు మొక్కే నేను

(॥మేలు॥)
యే లాటా లాపెతోడ నెటువలె నాడితివో
మేలమాడ నేర్తువంటా మెచ్చీ నిన్ను
లాలించి మనసేరితి లలిఁగరఁగించితివో
పోలించి యందరిలోనాఁ బొగడీని నిన్ను

(॥మేలు॥)
యేకతాననుండి నీవు యెంత చనవిచ్చితివో
తూకొని వేడుకతో సంతోసించి నిన్ను
జోకగా నేమిట నీవు చొక్కఁగఁ జేసితివో
యేకడా జాణఁడవంటా యెంచీని నిన్ను

(॥మేలు॥)
నెట్టుక రతుల నెట్టు నీవు గాఁగిలించితివో
జుట్టవేలఁ బలుమారుఁ జూపీ నిన్ను
గుట్టుతో శ్రీవేంకటేశ కూడితివి నన్ను నేఁడు
అట్టె నా వావి చెప్పి తా నాదరించీ నిన్ను

(||pallavi||)
melu melu yī kīrdi mikkilim̐ gaṭṭugŏṁṭivi
nī lāgulĕllām̐ jūsi nīgu mŏkke nenu

(||melu||)
ye lāḍā lābĕdoḍa nĕḍuvalĕ nāḍidivo
melamāḍa nerduvaṁṭā mĕchchī ninnu
lāliṁchi manaseridi lalim̐garam̐giṁchidivo
poliṁchi yaṁdarilonām̐ bŏgaḍīni ninnu

(||melu||)
yegadānanuṁḍi nīvu yĕṁta sanavichchidivo
tūgŏni veḍugado saṁtosiṁchi ninnu
jogagā nemiḍa nīvu sŏkkam̐gam̐ jesidivo
yegaḍā jāṇam̐ḍavaṁṭā yĕṁchīni ninnu

(||melu||)
nĕṭṭuga radula nĕṭṭu nīvu gām̐giliṁchidivo
juṭṭavelam̐ balumārum̐ jūbī ninnu
guṭṭudo śhrīveṁkaḍeśha kūḍidivi nannu nem̐ḍu
aṭṭĕ nā vāvi sĕppi tā nādariṁchī ninnu