Melu melu ramanumda mechchidi ninnu

మేలు మేలు రమణుఁడ మెచ్చితి నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలు మేలు రమణుఁడ మెచ్చితి నిన్ను
చాలి నీ సేఁతలకెల్ల సంతోసింతు నేను

(॥మేలు॥)
కలవు నామీఁద బత్తి కన్నులఁ జూచితి విదె
వలచినవలపులు వన్నె కెక్కెను
తలఁపులు దెలియక తమకింతు నింతె కాక
యెలమి నీవల్ల నీవల్ల వెల తించుకంత లేదు

(॥మేలు॥)
నిక్కమె నీ మాట లెల్ల నేఁ డీడకు వచ్చితిని
తొక్కినపాదపుఁ దొక్కు తుదు కెక్కెను
యెక్కుడు నీ నవ్వులకు నీసడింతు నింతె కాక
యెక్కడా నీవొళ్ల దప్పు లెంచఁ జోటు గలదా

(॥మేలు॥)
చెల్లెను నీ సేఁత లెల్ల చేపట్టి కూడితి విదె
యెల్లగా నా కోరెకెలు యీడేరెను
కొల్లగా శ్రీవెంకటేశ కొసరుదు నింతె కాక
పొల్లు లేని నీగుణాల పొరపొచ్చ మున్నదా

(||pallavi||)
melu melu ramaṇum̐ḍa mĕchchidi ninnu
sāli nī sem̐talagĕlla saṁtosiṁtu nenu

(||melu||)
kalavu nāmīm̐da batti kannulam̐ jūsidi vidĕ
valasinavalabulu vannĕ kĕkkĕnu
talam̐pulu dĕliyaga tamagiṁtu niṁtĕ kāga
yĕlami nīvalla nīvalla vĕla tiṁchugaṁta ledu

(||melu||)
nikkamĕ nī māḍa lĕlla nem̐ ḍīḍagu vachchidini
tŏkkinabādabum̐ dŏkku tudu kĕkkĕnu
yĕkkuḍu nī navvulagu nīsaḍiṁtu niṁtĕ kāga
yĕkkaḍā nīvŏḽla dappu lĕṁcham̐ joḍu galadā

(||melu||)
sĕllĕnu nī sem̐ta lĕlla sebaṭṭi kūḍidi vidĕ
yĕllagā nā korĕgĕlu yīḍerĕnu
kŏllagā śhrīvĕṁkaḍeśha kŏsarudu niṁtĕ kāga
pŏllu leni nīguṇāla pŏrabŏchcha munnadā