మేలు మేలు రాఁగా రాఁగా మెచ్చితి నిన్ను
(॥పల్లవి॥)
మేలు మేలు రాఁగా రాఁగా మెచ్చితి నిన్ను
కోలు ముందై యిందే కాక కొండకుఁ బొయ్యేవా
(॥మేలు మేలు॥)
సంతసాన నేనీతో జరసి మాటడఁగాను
పంతము దప్పీ నంటాఁ బలుకవు
రంతుల నేఁడె నీకు రాజస మెంత గల్లాను
కాంతలమీఁదనె కాక కడఁ జూపేవా
(॥మేలు మేలు॥)
సలిగెతో నేనెంత నటలు సేసిన నీవు
చలము దప్పీ నంటా సరి నగవు
పెలుచుఁదనాన నీకు బీర మెంత గలిగినా
చెలులమీఁదనె యింత సేయక మానేవా
(॥మేలు మేలు॥)
యేపుననీ ముందటనె యెంత నిలుచుండినా నీ
చూపు లరగీ నంటాఁ జూడ జాలవూ
బాపుర శ్రీవెంకటేశ పచ్చిగాఁ గూడితి నన్ను
నీ పొందు నాతోనె కాక నేఁడు మానేవా
(||pallavi||)
melu melu rām̐gā rām̐gā mĕchchidi ninnu
kolu muṁdai yiṁde kāga kŏṁḍagum̐ bŏyyevā
(||melu melu||)
saṁtasāna nenīdo jarasi māḍaḍam̐gānu
paṁtamu dappī naṁṭām̐ balugavu
raṁtula nem̐ḍĕ nīgu rājasa mĕṁta gallānu
kāṁtalamīm̐danĕ kāga kaḍam̐ jūbevā
(||melu melu||)
saligĕdo nenĕṁta naḍalu sesina nīvu
salamu dappī naṁṭā sari nagavu
pĕlusum̐danāna nīgu bīra mĕṁta galiginā
sĕlulamīm̐danĕ yiṁta seyaga mānevā
(||melu melu||)
yebunanī muṁdaḍanĕ yĕṁta nilusuṁḍinā nī
sūbu laragī naṁṭām̐ jūḍa jālavū
bābura śhrīvĕṁkaḍeśha pachchigām̐ gūḍidi nannu
nī pŏṁdu nādonĕ kāga nem̐ḍu mānevā