మేలు మేలు నీచేఁతలు; మెచ్చితి నిన్ను
(॥పల్లవి॥)
మేలు మేలు నీచేఁతలు; మెచ్చితి నిన్ను
వాలాఇంచి ఇందరిలో వలపించుకొంటివి
(॥మేలు॥)
వెలినుండి కలఁకలు వెదకేవు మాఁటలకు
తలములు సోఁకించి తమకించేవు
ములుఁగుచు వలపులు మోకు గట్టి యెత్తేవు
తలఁచితే నేడనైనా తగఁ బొడచూపేవు
(॥మేలు॥)
గుట్టునఁ గొలచినండే(దే) కొలచే వేపనికైనా
యెట్టి కులమైనా నట్టు నిట్టు సే సేవు
రట్టుగా సతులకై రాఁపులనే పెనఁగేవు
వెట్టికిఁ గొండయైనాను వేలనే యెత్తేవు
(॥మేలు॥)
సిగ్గు లెగ్గు లెంచక చెలులతో మాఁటాడేవు
వొగ్గి తూరలెక్కేవు నీ వుద్దాండనను
అగ్గమై శ్రీ వేంకటేశ యన్నిటా జాణవౌదు
వెగ్గళించితే రూపులు వేవేలయ్యేవు
(||pallavi||)
melu melu nīsem̐talu; mĕchchidi ninnu
vālāiṁchi iṁdarilo valabiṁchugŏṁṭivi
(||melu||)
vĕlinuṁḍi kalam̐kalu vĕdagevu mām̐ṭalagu
talamulu som̐kiṁchi tamagiṁchevu
mulum̐gusu valabulu mogu gaṭṭi yĕttevu
talam̐side neḍanainā tagam̐ bŏḍasūbevu
(||melu||)
guṭṭunam̐ gŏlasinaṁḍe(de) kŏlase vebanigainā
yĕṭṭi kulamainā naṭṭu niṭṭu se sevu
raṭṭugā sadulagai rām̐pulane pĕnam̐gevu
vĕṭṭigim̐ gŏṁḍayainānu velane yĕttevu
(||melu||)
siggu lĕggu lĕṁchaga sĕlulado mām̐ṭāḍevu
vŏggi tūralĕkkevu nī vuddāṁḍananu
aggamai śhrī veṁkaḍeśha yanniḍā jāṇavaudu
vĕggaḽiṁchide rūbulu vevelayyevu