మేలు మేలు నీ సతిని మెచ్చి రిందరు
(॥పల్లవి॥)
మేలు మేలు నీ సతిని మెచ్చి రిందరు
యీ లాగు నీవే తగుదు విటువంటిదానికి
(॥మేలు॥)
తప్ప కిట్టె చూచితేను తలవంచుకొనవద్దా
కప్పినజవ్వనపుసిగ్గరిదానికి
చిప్పలఁ జెనకితేను చిరునవ్వు నవ్వవద్దా
నెప్పునఁ దెలివిగల నీరుపదిదానికి
(॥మేలు॥)
యెలమిఁ జేయి వేసితే యిచ్చగించి వుండవద్దా
దొరసినయట్టి గుట్టుతోడిదానికి
ఇరవై శ్రీవేంకటేశ యేలితివి సతినిట్టె
తిరమాయ సిరులు నేదేవులైన దానికి
(||pallavi||)
melu melu nī sadini mĕchchi riṁdaru
yī lāgu nīve tagudu viḍuvaṁṭidānigi
(||melu||)
tappa kiṭṭĕ sūsidenu talavaṁchugŏnavaddā
kappinajavvanabusiggaridānigi
sippalam̐ jĕnagidenu sirunavvu navvavaddā
nĕppunam̐ dĕlivigala nīrubadidānigi
(||melu||)
yĕlamim̐ jeyi veside yichchagiṁchi vuṁḍavaddā
dŏrasinayaṭṭi guṭṭudoḍidānigi
iravai śhrīveṁkaḍeśha yelidivi sadiniṭṭĕ
tiramāya sirulu nedevulaina dānigi