Melu melu nee kadalu mechchidimayyaa

మేలు మేలు నీ కతలు మెచ్చితిమయ్యా
Language

(॥పల్లవి॥)
మేలు మేలు నీ కతలు మెచ్చితిమయ్యా
యేలుకొంటి విందరిని యెంతవాఁడవయ్యా

(॥॥)
చల్లువెడమాట లాడి సతులవలపులెల్ల
కొల్లగాఁ గలయఁ బెట్టి ఆలు గుంపు సేసేవు
అల్లి బిల్లి సేసి కూడి ఆలు మోపులుగట్టి
యెల్లవారిమీఁద వేసే వెంతవాఁడవయ్యా

(॥॥)
వాడికనవ్వులు నవ్వి వనితల మానములు
కూడపెట్టి లోలోనే గుది గుచ్చేవు
యీడుజోడుగాఁ బెనఁగి యింపులు మచ్చులువేసి
యీడేరించితివి మమ్ము నెంతవాఁడవయ్యా

(॥॥)
మోవితీపులు మరపి ముదితల జవ్వనాలు
భావముల వడివెట్టి పచ్చిరేఁచేవు
శ్రీ వేంకటేశ నాపై సిగ్గులు నానఁబెట్టి
యీవల నన్నుఁగూడితి వెంతవాఁడవయ్యా

(||pallavi||)
melu melu nī kadalu mĕchchidimayyā
yelugŏṁṭi viṁdarini yĕṁtavām̐ḍavayyā

(||||)
salluvĕḍamāḍa lāḍi sadulavalabulĕlla
kŏllagām̐ galayam̐ bĕṭṭi ālu guṁpu sesevu
alli billi sesi kūḍi ālu mobulugaṭṭi
yĕllavārimīm̐da vese vĕṁtavām̐ḍavayyā

(||||)
vāḍiganavvulu navvi vanidala mānamulu
kūḍabĕṭṭi lolone gudi guchchevu
yīḍujoḍugām̐ bĕnam̐gi yiṁpulu machchuluvesi
yīḍeriṁchidivi mammu nĕṁtavām̐ḍavayyā

(||||)
movidībulu marabi mudidala javvanālu
bhāvamula vaḍivĕṭṭi pachchirem̐sevu
śhrī veṁkaḍeśha nābai siggulu nānam̐bĕṭṭi
yīvala nannum̐gūḍidi vĕṁtavām̐ḍavayyā