Melu melu nee gunamu mechchidi nenu

మేలు మేలు నీ గుణము మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలు మేలు నీ గుణము మెచ్చితి నేను
నీ లీల లోకమెల్లా నిండెఁగా నేఁడు

(॥॥)
వలపుగలుగువారు వద్దనే వుందురుగాక
తిలకించి వాడలకు దిరుగుదురా
తెలిపి చెప్పగనేల తేటతెల్లమిగ నాపె-
కలువదండ నీ మెడఁ గంటిగా నే నిపుడు

(॥॥)
ననుపుగలుగువారు నవ్వుతానుందురుగాక
తనివో కెవ్వితెనై నాఁ దలపోతురా
వెనుకటి సుద్దులేల వేడుకతో నాపెచేతి-
కొనవేలివుంగరము గురుతాయఁగా

(॥॥)
కైవసమైనవారు కాఁగిట నుందురుగాక
ఆవలివారితో మేలాలాడుదురా
శ్రీవేంకటేశ నన్నుఁ జేరి యిట్టెకూడితివి
నీవే నన్ను మన్నించుట నిజమాయఁగా

(||pallavi||)
melu melu nī guṇamu mĕchchidi nenu
nī līla logamĕllā niṁḍĕm̐gā nem̐ḍu

(||||)
valabugaluguvāru vaddane vuṁdurugāga
tilagiṁchi vāḍalagu dirugudurā
tĕlibi sĕppaganela teḍadĕllamiga nābĕ-
kaluvadaṁḍa nī mĕḍam̐ gaṁṭigā ne nibuḍu

(||||)
nanubugaluguvāru navvudānuṁdurugāga
tanivo kĕvvidĕnai nām̐ dalabodurā
vĕnugaḍi suddulela veḍugado nābĕsedi-
kŏnavelivuṁgaramu gurudāyam̐gā

(||||)
kaivasamainavāru kām̐giḍa nuṁdurugāga
āvalivārido melālāḍudurā
śhrīveṁkaḍeśha nannum̐ jeri yiṭṭĕgūḍidivi
nīve nannu manniṁchuḍa nijamāyam̐gā