Melu melu nee gunaalu mechchidi nenu

మేలు మేలు నీ గుణాలు మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలు మేలు నీ గుణాలు మెచ్చితి నేను
తాలిమి మాకింత నుంటే తరుణుల మౌదుమా

(॥మేలు॥)
వెరవున నే నెంత వేగిరించి దూరినాను
సరవి దప్పవు నీశాంత మెట్టిదో
యిరవుగ నీ గుండె ఇంత బలువు గాకుంటే
తెరలి పెక్కు సతులఁ దెచ్చుకొందువా

(॥మేలు॥)
కాతరినై నే నిన్ను కరకరిఁ బెట్టినాను
ఆతుర పడవు యెంత అభ్యాసమో
భీతి విడిచింత నీకు బిరుదు గలుగకుంటే
ఘాతల గొల్లెతలఁ జీఁకటితప్పు సేతువా

(॥మేలు॥)
నిబ్బరపురతి నిన్ను నే నెంత పెనఁగినాను
వుబ్బు సడు(డ)లవు యెంత వొట్టిన యాసో
గబ్బివై శ్రీ వేంకటేశ కడునీటు మీరకుంటే
తబ్బిబ్బులేక నన్నింత తప్పక యేలుదువా

(||pallavi||)
melu melu nī guṇālu mĕchchidi nenu
tālimi māgiṁta nuṁṭe taruṇula maudumā

(||melu||)
vĕravuna ne nĕṁta vegiriṁchi dūrinānu
saravi dappavu nīśhāṁta mĕṭṭido
yiravuga nī guṁḍĕ iṁta baluvu gāguṁṭe
tĕrali pĕkku sadulam̐ dĕchchugŏṁduvā

(||melu||)
kādarinai ne ninnu karagarim̐ bĕṭṭinānu
ādura paḍavu yĕṁta abhyāsamo
bhīdi viḍisiṁta nīgu birudu galugaguṁṭe
ghādala gŏllĕdalam̐ jīm̐kaḍidappu seduvā

(||melu||)
nibbaraburadi ninnu ne nĕṁta pĕnam̐ginānu
vubbu saḍu(ḍa)lavu yĕṁta vŏṭṭina yāso
gabbivai śhrī veṁkaḍeśha kaḍunīḍu mīraguṁṭe
tabbibbulega nanniṁta tappaga yeluduvā