Melu melu mechchidimi melumtalamu

మేలు మేలు మెచ్చితిమి మెలుఁతలము
Language

(॥పల్లవి॥)
మేలు మేలు మెచ్చితిమి మెలుఁతలము
పేలరివై యీ పనికే పెరిగితివయ్యా

(॥మేలు॥)
ఆలరివనితలు యేమనినా నోరుతువు
తాలిమిగలవాఁడవు తగుదువయ్యా
మూలల చనుఁగొండలు మోవఁగ నోపుదువిట్టె
వాలనట్టి దిగ్గజము వంటి వాఁడవయ్యా

(॥మేలు॥)
అట్టె యంగనలు నీతో నలిగిన ములుగవు
చుట్టిరికపువాఁడవు సుగుడవయ్యా
గట్టిగాఁ దురుమల మేఘములెల్ల నానుదువు
వొట్టి కొండవంటివాఁడ వోపుదువయ్యా

(॥మేలు॥)
తొయ్యలుల పాదాల తొక్కుడుకు నోరుతువు
యెయ్యడ భారకుఁడవు యేలికెవయ్యా
వొయ్యనే శ్రీ వేంకటేశ వొనఁగూడితివి నన్ను
నెయ్యపు చింతామణి వంటి వాఁడవయ్యా

(||pallavi||)
melu melu mĕchchidimi mĕlum̐talamu
pelarivai yī panige pĕrigidivayyā

(||melu||)
ālarivanidalu yemaninā noruduvu
tālimigalavām̐ḍavu taguduvayyā
mūlala sanum̐gŏṁḍalu movam̐ga nobuduviṭṭĕ
vālanaṭṭi diggajamu vaṁṭi vām̐ḍavayyā

(||melu||)
aṭṭĕ yaṁganalu nīdo naligina mulugavu
suṭṭirigabuvām̐ḍavu suguḍavayyā
gaṭṭigām̐ durumala meghamulĕlla nānuduvu
vŏṭṭi kŏṁḍavaṁṭivām̐ḍa vobuduvayyā

(||melu||)
tŏyyalula pādāla tŏkkuḍugu noruduvu
yĕyyaḍa bhāragum̐ḍavu yeligĕvayyā
vŏyyane śhrī veṁkaḍeśha vŏnam̐gūḍidivi nannu
nĕyyabu siṁtāmaṇi vaṁṭi vām̐ḍavayyā