మేలు మేలు జవరాలు మెఱసే నీ సింగారాలు
(॥పల్లవి॥)
మేలు మేలు జవరాలు మెఱసే నీ సింగారాలు
కోలుముందై నీ కిన్నిటా గుఱుతులు సేసీనే
(॥మేలు॥)
చనుగుబ్బల మీఁదటి చంద్రవంకలు
కనుఁగొన చూపుల కడకెంపులు
తనువుపై చెమట చిత్తడి సోనలు
గొనకొన్న రతులకు గురుతులు సేసీనే
(॥మేలు॥)
నొసలిపైఁ జెదరిన నునుఁగురులు
ముసిముసినవ్వుల మురిపెములు
అసురుసురుల తోడి యలయికలు
కొసరేటి రతులకు గురుతులు సేసీనే
(॥మేలు॥)
ముదమునఁ దేరేటి మోముకళలు
పెదవిపై నిండిన ముప్పిరిబేంట్లు
యెదుట శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నేలఁగాను
గుదివొన్న రతులకు గురుతులు సేసీనే
(||pallavi||)
melu melu javarālu mĕṟase nī siṁgārālu
kolumuṁdai nī kinniḍā guṟudulu sesīne
(||melu||)
sanugubbala mīm̐daḍi saṁdravaṁkalu
kanum̐gŏna sūbula kaḍagĕṁpulu
tanuvubai sĕmaḍa sittaḍi sonalu
gŏnagŏnna radulagu gurudulu sesīne
(||melu||)
nŏsalibaim̐ jĕdarina nunum̐gurulu
musimusinavvula muribĕmulu
asurusurula toḍi yalayigalu
kŏsareḍi radulagu gurudulu sesīne
(||melu||)
mudamunam̐ dereḍi momugaḽalu
pĕdavibai niṁḍina muppiribeṁṭlu
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnelam̐gānu
gudivŏnna radulagu gurudulu sesīne