మేలు మేలు జాణవు మెచ్చితి నాపెను నేను
(॥పల్లవి॥)
మేలు మేలు జాణవు మెచ్చితి నాపెను నేను
నీ లాగులెల్లా నాపె నేరిపినవేకా
(॥మేలు॥)
కనుసన్నలనే మొక్కి కాంత సేవలు సేసి
తనువు సోఁకుల నిన్ను దమిరేఁచెఁగా
చెనకులఁ బొద్దు వుచ్చి చెక్కు కొనగోర నూఁది
పెనఁగులాటల నీకుఁ బ్రియము వుట్టించెఁగా
(॥మేలు॥)
చుట్టరికములు చెప్పి సొలసి వద్దఁ గూచుండి
నట్ట నడుమనే నిన్ను నవ్వించెఁగా
గుట్టుతోనే మేలమాడి కొప్ప దువ్వి బుజ్జగించి
పట్టపగలే నిన్ను భ్రమయించెఁగా
(॥మేలు॥)
చన్ను లురమున నాని చవులెల్లా మోవిఁ జూపి
వన్నెలాఁడి ఇంత నిన్ను వలపించెఁగా
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
తిన్నని రతులఁ దానూఁ దేలించెఁగా
(||pallavi||)
melu melu jāṇavu mĕchchidi nābĕnu nenu
nī lāgulĕllā nābĕ neribinavegā
(||melu||)
kanusannalane mŏkki kāṁta sevalu sesi
tanuvu som̐kula ninnu damirem̐sĕm̐gā
sĕnagulam̐ bŏddu vuchchi sĕkku kŏnagora nūm̐di
pĕnam̐gulāḍala nīgum̐ briyamu vuṭṭiṁchĕm̐gā
(||melu||)
suṭṭarigamulu sĕppi sŏlasi vaddam̐ gūsuṁḍi
naṭṭa naḍumane ninnu navviṁchĕm̐gā
guṭṭudone melamāḍi kŏppa duvvi bujjagiṁchi
paṭṭabagale ninnu bhramayiṁchĕm̐gā
(||melu||)
sannu luramuna nāni savulĕllā movim̐ jūbi
vannĕlām̐ḍi iṁta ninnu valabiṁchĕm̐gā
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
tinnani radulam̐ dānūm̐ deliṁchĕm̐gā