మేలు మేలు జాణవౌదు మెచ్చితి నిన్ను
(॥పల్లవి॥)
మేలు మేలు జాణవౌదు మెచ్చితి నిన్ను
కాలు దాఁకినంతలోనె కందువ లంటేవు
(॥మేలు॥)
నెయ్యపు చేఁతలకెల్ల నేరుపరివంటేను
పయ్యెద కొంగు వట్టేవు పలుమారును
తొయ్యలుల రతికిని దొడ్డవాఁడ వంటేను
తియ్యని మో వడిగేవు తేకువ మెరయను
(॥మేలు॥)
నంటున నీమోము చూచి నవ్వులు నవ్వితేను
వెంట వెంటఁ బొదిగేవు వేసారపు
వొంటరి వనుచు నీ కొలువును సేసితేను
అంటిముట్టి సరసములాడఁ జూచేవు
(॥మేలు॥)
సమ్మతించి యిన్నిటాను చనవు చెల్లించితేను
దిమ్మరి విద్యలఁ గూడి తెరవేసేవు
నెమ్మది శ్రీ వేంకటేశ నీకు నే నెదురాడేనా
కుమ్మరించి వలపులు గురి సే సేవు
(||pallavi||)
melu melu jāṇavaudu mĕchchidi ninnu
kālu dām̐kinaṁtalonĕ kaṁduva laṁṭevu
(||melu||)
nĕyyabu sem̐talagĕlla nerubarivaṁṭenu
payyĕda kŏṁgu vaṭṭevu palumārunu
tŏyyalula radigini dŏḍḍavām̐ḍa vaṁṭenu
tiyyani mo vaḍigevu teguva mĕrayanu
(||melu||)
naṁṭuna nīmomu sūsi navvulu navvidenu
vĕṁṭa vĕṁṭam̐ bŏdigevu vesārabu
vŏṁṭari vanusu nī kŏluvunu sesidenu
aṁṭimuṭṭi sarasamulāḍam̐ jūsevu
(||melu||)
sammadiṁchi yinniḍānu sanavu sĕlliṁchidenu
dimmari vidyalam̐ gūḍi tĕravesevu
nĕmmadi śhrī veṁkaḍeśha nīgu ne nĕdurāḍenā
kummariṁchi valabulu guri se sevu