మేలు మేలు జాణఁడవు మెచ్చితి నిన్ను
(॥పల్లవి॥)
మేలు మేలు జాణఁడవు మెచ్చితి నిన్ను
నాలి సేసినందులకు నవ్వుటిది తగదా
(॥మేలు॥)
ముంచి నీ తేనెమాటల మొగచాటాయ నాకు
పొంచి నిమ్మపంట వేయఁ బొసఁగు నీవు
అంచలఁ దాఁకిన నొప్పియది వొక్కటైనాఁ గాని
యెంచఁ దీపువెగటుక యీ వులుసు దగదా
(॥మేలు॥)
చల్లని నీ ప్రియముల చలిమిరించెను మేను
యిల్లిదె కారపువీడె మియ్యఁ దగదా
మొల్లమి నా వేఁడికి మోవి పొక్కినాఁ బొక్కనీ
కల్ల గా దీ చలువకు కాఁక లిది దగదా
(॥మేలు॥)
మదము నీకూటమికి మఱ పాయ మతి నాకు
వుదుటు గోరి యెఱుక వొసరె నేఁడు
అదన శ్రీవేంకటేశ అప్పుడే కూడితి నన్ను
యెదిటి పరాకులకు యెచ్చరికె దగదా
(||pallavi||)
melu melu jāṇam̐ḍavu mĕchchidi ninnu
nāli sesinaṁdulagu navvuḍidi tagadā
(||melu||)
muṁchi nī tenĕmāḍala mŏgasāḍāya nāgu
pŏṁchi nimmabaṁṭa veyam̐ bŏsam̐gu nīvu
aṁchalam̐ dām̐kina nŏppiyadi vŏkkaḍainām̐ gāni
yĕṁcham̐ dībuvĕgaḍuga yī vulusu dagadā
(||melu||)
sallani nī priyamula salimiriṁchĕnu menu
yillidĕ kārabuvīḍĕ miyyam̐ dagadā
mŏllami nā vem̐ḍigi movi pŏkkinām̐ bŏkkanī
kalla gā dī saluvagu kām̐ka lidi dagadā
(||melu||)
madamu nīgūḍamigi maṟa pāya madi nāgu
vuduḍu gori yĕṟuga vŏsarĕ nem̐ḍu
adana śhrīveṁkaḍeśha appuḍe kūḍidi nannu
yĕdiḍi parāgulagu yĕchcharigĕ dagadā