Melu melu doravaudu mestiraa ninnu

మేలు మేలు దొరవౌదు మెస్తిరా నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలు మేలు దొరవౌదు మెస్తిరా నిన్ను
తాలి మింత లేకున్న తగుదువా మాకును

(॥మేలు॥)
చేరి నే దూరితే నీవు సెలవినే నవ్వుదువు
వేరెవెంగె మాడితేను వేడుకొందువు
వోరు పింత లేకున్న నూరఁగల గొల్లెతలు
వారికివారే వలచి వత్తురా నీకును

(॥మేలు॥)
కన్నుల నే జంకించితే కడుఁ జేత మొక్కుదువు
పన్ని నేఁదిట్టితే నన్నుఁ జాలార్చేవు
అన్నేసి నేరకున్న నసుర కామినులెల్ల
చిన్ని నీమాటల కెల్లఁ జిక్కుదురా నాఁడు

(॥మేలు॥)
వొద్దని నే నలిగితే నొడివట్టి పెనఁగుదు
గద్దించితే నట్టె నన్నుఁ గాఁగిలింతువు
వుద్దండ మింత లేకున్న నొగి నిందిరయు భూమి
యిద్దరు శ్రీ వేంకటేశ యెనతురా నిన్నును

(||pallavi||)
melu melu dŏravaudu mĕstirā ninnu
tāli miṁta legunna taguduvā māgunu

(||melu||)
seri ne dūride nīvu sĕlavine navvuduvu
verĕvĕṁgĕ māḍidenu veḍugŏṁduvu
voru piṁta legunna nūram̐gala gŏllĕdalu
vārigivāre valasi vatturā nīgunu

(||melu||)
kannula ne jaṁkiṁchide kaḍum̐ jeda mŏkkuduvu
panni nem̐diṭṭide nannum̐ jālārsevu
annesi neragunna nasura kāminulĕlla
sinni nīmāḍala kĕllam̐ jikkudurā nām̐ḍu

(||melu||)
vŏddani ne naligide nŏḍivaṭṭi pĕnam̐gudu
gaddiṁchide naṭṭĕ nannum̐ gām̐giliṁtuvu
vuddaṁḍa miṁta legunna nŏgi niṁdirayu bhūmi
yiddaru śhrī veṁkaḍeśha yĕnadurā ninnunu