Melu melu daani nitte mechchidi nenu

మేలు మేలు దాని నిట్టె మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలు మేలు దాని నిట్టె మెచ్చితి నేను
తాలిమితోఁ దనపొందు దలపించె నీకును

(॥మేలు॥)
కాతరాన నీ విప్పుడు కంటివోయేమో కాని
చేతలెత్తి నీకుమొక్కిఁజెలి యందుండి
యీతల నీ వప్పటిని యేలదాఁచేవో కాని
నీతురుము దాఁక వేసె నిమ్మపంట నిపుడు

(॥మేలు॥)
చెలఁగి సిగ్గువడి దాఁచితివో యేమోకానీ
పలుకుల సోఁకనాడీ పడతి నిన్ను
యెలమిని నీమనసు నెట్టున్నదో కానీ
సెలవుల నవ్వు నవ్వి చిమ్మిరేఁచీ నిన్నును

(॥మేలు॥)
కాఁగిటిలో నెటువలెఁగలసితివో కానీ
చేఁగదేర మోవి చూపీఁ జిగురుఁబోడి
యేఁగి వచ్చి శ్రీవేంకటేశ నన్ను నేలితివి
పాఁగినచన్నులఁదనపస చూపి నీకును

(||pallavi||)
melu melu dāni niṭṭĕ mĕchchidi nenu
tālimidom̐ danabŏṁdu dalabiṁchĕ nīgunu

(||melu||)
kādarāna nī vippuḍu kaṁṭivoyemo kāni
sedalĕtti nīgumŏkkim̐jĕli yaṁduṁḍi
yīdala nī vappaḍini yeladām̐sevo kāni
nīdurumu dām̐ka vesĕ nimmabaṁṭa nibuḍu

(||melu||)
sĕlam̐gi sigguvaḍi dām̐sidivo yemogānī
palugula som̐kanāḍī paḍadi ninnu
yĕlamini nīmanasu nĕṭṭunnado kānī
sĕlavula navvu navvi simmirem̐sī ninnunu

(||melu||)
kām̐giḍilo nĕḍuvalĕm̐galasidivo kānī
sem̐gadera movi sūbīm̐ jigurum̐boḍi
yem̐gi vachchi śhrīveṁkaḍeśha nannu nelidivi
pām̐ginasannulam̐danabasa sūbi nīgunu