మేలు మేలు బాపు బాపు మెచ్చితి నిన్ను
(॥పల్లవి॥)
మేలు మేలు బాపు బాపు మెచ్చితి నిన్ను
తాలిమితో నున్నాఁడవు తగవరి వౌదువు
(॥మేలు॥)
యేకడనో వుంటి వట యే మేమో సేసితి వట
ఆకె నాతోఁ జెప్పనవి ఆ మాటలె
వాకున నాడ నోపక వాసితో నూరకుండితే
నీకు నీకె నవ్వేవు నెరజాణ వౌదువు
(॥మేలు॥)
మంతనా లాడితి వట మరికొన్ని గల వట
యింతి నాకు మొక్కినది యీ సుద్దికె
అంత నిన్నుఁ బచ్చి సేయ కట్టె అణఁచుకుంటే
దొత వెట్టేవు సటలె దొరవు నీ వౌదువు
(॥మేలు॥)
వొడఁబరచితి వట వొక్క టై కూడితి వట
పడఁతి యెచ్చరించె నీ పనులకునె
తడవక నే నుండితె తలపించే నప్పటిని
అడరి శ్రీవెంకటేశ అంతవాఁడ వౌదువు
(||pallavi||)
melu melu bābu bābu mĕchchidi ninnu
tālimido nunnām̐ḍavu tagavari vauduvu
(||melu||)
yegaḍano vuṁṭi vaḍa ye memo sesidi vaḍa
āgĕ nādom̐ jĕppanavi ā māḍalĕ
vāguna nāḍa nobaga vāsido nūraguṁḍide
nīgu nīgĕ navvevu nĕrajāṇa vauduvu
(||melu||)
maṁtanā lāḍidi vaḍa marigŏnni gala vaḍa
yiṁti nāgu mŏkkinadi yī suddigĕ
aṁta ninnum̐ bachchi seya kaṭṭĕ aṇam̐suguṁṭe
dŏda vĕṭṭevu saḍalĕ dŏravu nī vauduvu
(||melu||)
vŏḍam̐barasidi vaḍa vŏkka ṭai kūḍidi vaḍa
paḍam̐ti yĕchchariṁchĕ nī panulagunĕ
taḍavaga ne nuṁḍidĕ talabiṁche nappaḍini
aḍari śhrīvĕṁkaḍeśha aṁtavām̐ḍa vauduvu