మేలు మేలు అన్నిటాను మెచ్చితి నిన్ను
(॥పల్లవి॥)
మేలు మేలు అన్నిటాను మెచ్చితి నిన్ను
నాలితో నూరకుండితే నవ్వినంతే ఫలము
(॥మేలు॥)
నగుతానే వచ్చి నీవు నాకు నాపెకును నేడు
తగవులు చెప్పగానే తనిసితిని
యెగసక్కేలే లాడేను యేమి వచ్చీ నిందువంక
మొగము చూచితేను మొక్కినంతే ఫలము
(॥మేలు॥)
సమ్మతించి నిద్దరికి సరికి బేసికి నీవు
నమ్మికలియ్యగానే ఆనందించితిని
కమ్మటినేలదూరేను కానవచ్చినపనికి
కమ్మి నావద్ద నుంటేనే కైకొన్నంత ఫలము
(॥మేలు॥)
వొట్టుక పానుపుమీఁద వొకరొకరిఁ దెలిపి
యిట్టె కాఁగిలించితేనే యిరవైతిని
నెట్టన శ్రీవేంకటేశ, నెమ్మది మమ్మేలితివి
అట్టె సేసచల్లితే పెండ్లాడినంతే ఫలము
(||pallavi||)
melu melu anniḍānu mĕchchidi ninnu
nālido nūraguṁḍide navvinaṁte phalamu
(||melu||)
nagudāne vachchi nīvu nāgu nābĕgunu neḍu
tagavulu sĕppagāne tanisidini
yĕgasakkele lāḍenu yemi vachchī niṁduvaṁka
mŏgamu sūsidenu mŏkkinaṁte phalamu
(||melu||)
sammadiṁchi niddarigi sarigi besigi nīvu
nammigaliyyagāne ānaṁdiṁchidini
kammaḍineladūrenu kānavachchinabanigi
kammi nāvadda nuṁṭene kaigŏnnaṁta phalamu
(||melu||)
vŏṭṭuga pānubumīm̐da vŏgarŏgarim̐ dĕlibi
yiṭṭĕ kām̐giliṁchidene yiravaidini
nĕṭṭana śhrīveṁkaḍeśha, nĕmmadi mammelidivi
aṭṭĕ sesasallide pĕṁḍlāḍinaṁte phalamu