మేలు మేలే యెంతవాఁడు మిక్కిలి సంతోసించితి
(॥పల్లవి॥)
మేలు మేలే యెంతవాఁడు మిక్కిలి సంతోసించితి
వాలాయముఁ గాదనకు వలతు నేననరే
(॥మేలు॥)
పొగడితి తనగుణంబులు చెవులారా విని
తగిలితిఁ దలచక్కఁదనాలు చూచి
తెగడితిఁ దనతోను తేరి సరసాలాడఁగ
నిగిడి తా నిన్నిటాను నెరవాది యగునే
(॥మేలు॥)
మెచ్చితిఁ దననేర్పులు మిగులా వేడుకతోడ
ఇచ్చితిఁ దనకు మోవి ఇతవెరిఁగి
యిచ్చితిఁ గాగిటతనుగురుతైన మన్ననకు
అచ్చముగ నెంచితేఁ దా నన్నిటాను జాణఁడే
(॥మేలు॥)
చొక్కితిఁ దననెయ్యపుసొంపుగురుతులకును
దక్కితిఁ దనవాడికతరితీపుల
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డేనలమేలుమంగను
నిక్కముగఁ దా నన్నిటా నేరుపరిగదవే
(||pallavi||)
melu mele yĕṁtavām̐ḍu mikkili saṁtosiṁchidi
vālāyamum̐ gādanagu valadu nenanare
(||melu||)
pŏgaḍidi tanaguṇaṁbulu sĕvulārā vini
tagilidim̐ dalasakkam̐danālu sūsi
tĕgaḍidim̐ danadonu teri sarasālāḍam̐ga
nigiḍi tā ninniḍānu nĕravādi yagune
(||melu||)
mĕchchidim̐ dananerbulu migulā veḍugadoḍa
ichchidim̐ danagu movi idavĕrim̐gi
yichchidim̐ gāgiḍadanugurudaina mannanagu
achchamuga nĕṁchidem̐ dā nanniḍānu jāṇam̐ḍe
(||melu||)
sŏkkidim̐ dananĕyyabusŏṁpugurudulagunu
dakkidim̐ danavāḍigadaridībula
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍenalamelumaṁganu
nikkamugam̐ dā nanniḍā nerubarigadave