Melu mele nee kadalu mechchiri maguvalellaa

మేలు మేలే నీ కతలు మెచ్చిరి మగువలెల్లా
Language

(॥పల్లవి॥)
మేలు మేలే నీ కతలు మెచ్చిరి మగువలెల్లా
యీ లాగులు నీ గరిమ లేమని చెప్పుదమే

(॥మేలు॥)
చెప్పేవు చుట్టరికాలు సేసేవు వినయాలు
దెప్పరాన పతినెంత తేలించేవే
కుప్పళించేవు ప్రియాలు గుదిగుచ్చేవు చూపులు
ఇప్ప డింతేసి చేఁతలు యెక్కడ నేర్చితివే

(॥మేలు॥)
చూపేవు నయగారాలు చొక్కించేవు సొలపుల
నీ పంతము నింతేసికా నెరపితివే
రేఁపేవు వలపు లూరించేవు తమకము
యీపాయాన జాణతనా లెన్ని గరచితివే

(॥మేలు॥)
యిచ్చకములే యాడేవు యింపులే వెదచల్లేవు
గుచ్చల నెన్నాళ్లనుండి కాచియుంటివే
యిచ్చల శ్రీవేంకటేశు నెనసితి విట్టానే
పచ్చిదేర నిన్నిటాను భాగ్యము సేసితివే

(||pallavi||)
melu mele nī kadalu mĕchchiri maguvalĕllā
yī lāgulu nī garima lemani sĕppudame

(||melu||)
sĕppevu suṭṭarigālu sesevu vinayālu
dĕpparāna padinĕṁta teliṁcheve
kuppaḽiṁchevu priyālu gudiguchchevu sūbulu
ippa ḍiṁtesi sem̐talu yĕkkaḍa nersidive

(||melu||)
sūbevu nayagārālu sŏkkiṁchevu sŏlabula
nī paṁtamu niṁtesigā nĕrabidive
rem̐pevu valabu lūriṁchevu tamagamu
yībāyāna jāṇadanā lĕnni garasidive

(||melu||)
yichchagamule yāḍevu yiṁpule vĕdasallevu
guchchala nĕnnāḽlanuṁḍi kāsiyuṁṭive
yichchala śhrīveṁkaḍeśhu nĕnasidi viṭṭāne
pachchidera ninniḍānu bhāgyamu sesidive