Melu mele javvani mechchidim bo ninnunu

మేలు మేలే జవ్వని మెచ్చితిఁ బో నిన్నును
Language

(॥పల్లవి॥)
మేలు మేలే జవ్వని మెచ్చితిఁ బో నిన్నును
తాలిమిఁ దెలిసెఁ గాక తారుకాణ లేఁటికే

(॥మలు॥)
కప్పర మిచ్చె నంటివి కాఁకరేఁగె నంటివి
యెప్పటి కెప్పటి మాఁట యేది నిజమే
రెప్పలు మూసితివి రేసులుఁ జేసితివి
గుప్పిటి నీ వలపులు కొలఁదెంచఁగలనా

(॥మలు॥)
కాలుఁ దాకించితివి గక్కన మొక్కితివి
యేల నీ కింత పగటు యేమందమే
యీలీల నీకు గొణఁగు యిందులోనే సణఁగు
లేలే నీ సుద్దు లివి లెక్కవెట్టవసమా

(॥మలు॥)
చెఱఁగూ బట్టితివి సేసాఁ బెట్టితివి
యెఱిఁగిన నీ చనవు నియ్య కొంటినే
మెఱయ శ్రీవేంకటాద్రి మేఁటినై నిన్నుఁగూడితి
తఱి నీ చేఁతకుఁజేఁత తతివచ్చెఁ గదవే

(||pallavi||)
melu mele javvani mĕchchidim̐ bo ninnunu
tālimim̐ dĕlisĕm̐ gāga tārugāṇa lem̐ṭige

(||malu||)
kappara michchĕ naṁṭivi kām̐karem̐gĕ naṁṭivi
yĕppaḍi kĕppaḍi mām̐ṭa yedi nijame
rĕppalu mūsidivi resulum̐ jesidivi
guppiḍi nī valabulu kŏlam̐dĕṁcham̐galanā

(||malu||)
kālum̐ dāgiṁchidivi gakkana mŏkkidivi
yela nī kiṁta pagaḍu yemaṁdame
yīlīla nīgu gŏṇam̐gu yiṁdulone saṇam̐gu
lele nī suddu livi lĕkkavĕṭṭavasamā

(||malu||)
sĕṟam̐gū baṭṭidivi sesām̐ bĕṭṭidivi
yĕṟim̐gina nī sanavu niyya kŏṁṭine
mĕṟaya śhrīveṁkaḍādri mem̐ṭinai ninnum̐gūḍidi
taṟi nī sem̐tagum̐jem̐ta tadivachchĕm̐ gadave