Melu mele javaraalaa mechchiri selulu ninnu

మేలు మేలే జవరాలా మెచ్చిరి చెలులు నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలు మేలే జవరాలా మెచ్చిరి చెలులు నిన్ను
యీ లీల వలపించితి విపుడు నీ విభుని

(॥మేలు॥)
మంచిమాంట లాడితేను మనసెల్లాఁ గరఁగును
వంచనతో నుండితేఁ గైవసమౌ పతి
కొంచక సేవసేసితేఁ గూరిములు సతమౌను
నించి యీచేఁతలెల్లా నీవే నేరుతువే

(॥మేలు॥)
యిచ్చకమై వుండితేను యితవౌను కాఁపురము
మచ్చికగా నవ్వితేను మర్మము లంటు
విచ్చనవిడి లోనై తే వేడుకలెల్లా రేఁగు
నిచ్చలు నీగుణములు నీయందే కలవే

(॥మేలు॥)
గుట్టున నోరుచుకొంటే కూటమి తానే కలుగు
చుట్టరికమే చూపతే సొంపు వుట్టును
యిట్టె శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నుఁ గలసె
నెట్టన నీసొబగులు నీకె యమరునే

(||pallavi||)
melu mele javarālā mĕchchiri sĕlulu ninnu
yī līla valabiṁchidi vibuḍu nī vibhuni

(||melu||)
maṁchimāṁṭa lāḍidenu manasĕllām̐ garam̐gunu
vaṁchanado nuṁḍidem̐ gaivasamau padi
kŏṁchaga sevasesidem̐ gūrimulu sadamaunu
niṁchi yīsem̐talĕllā nīve neruduve

(||melu||)
yichchagamai vuṁḍidenu yidavaunu kām̐puramu
machchigagā navvidenu marmamu laṁṭu
vichchanaviḍi lonai te veḍugalĕllā rem̐gu
nichchalu nīguṇamulu nīyaṁde kalave

(||melu||)
guṭṭuna norusugŏṁṭe kūḍami tāne kalugu
suṭṭarigame sūbade sŏṁpu vuṭṭunu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo ninnum̐ galasĕ
nĕṭṭana nīsŏbagulu nīgĕ yamarune