Melu melayyaa ninnu mechchidimi

మేలు మేలయ్యా నిన్ను మెచ్చితిమి
Language

(॥పల్లవి॥)
మేలు మేలయ్యా నిన్ను మెచ్చితిమి
తలిమి తోడుత నేఁడు తగ వెఱిఁగితివా

(॥మేలు॥)
సముకాన మెచ్చేవు సారెసారెఁ బొగడేవు
రమణిగుట్టెఱఁగవా రతులఁ దొల్లి
చెమటలు దుడిచేవు చేసురటి వినరేవు
నెమకి చుట్టరికము నేఁ డెఱిఁగితివా

(॥మేలు॥)
చెక్కలిట్టె నొక్కేవు శిరసిట్టె దువ్వేవు
చక్కఁదనములు నీ వెంచనా తొల్లి
అక్కరతోఁ వొదిగేవు ఆసలెల్లాఁ జూసేవు
యిక్కువతో వలపులు యిప్పుడెఱిఁగితివా

(॥మేలు॥)
కందునలు చూపేవు కాఁగిటు నించేవు
పొందులు యివెల్లాఁ దలపోయవా తొల్లి
అంది శ్రీవేంకటేశుఁడ అంగనఁ గూడితి విట్టె
అందపువేడుకలు నేఁడట్టె యెఱిఁగితివా

(||pallavi||)
melu melayyā ninnu mĕchchidimi
talimi toḍuda nem̐ḍu taga vĕṟim̐gidivā

(||melu||)
samugāna mĕchchevu sārĕsārĕm̐ bŏgaḍevu
ramaṇiguṭṭĕṟam̐gavā radulam̐ dŏlli
sĕmaḍalu duḍisevu sesuraḍi vinarevu
nĕmagi suṭṭarigamu nem̐ ḍĕṟim̐gidivā

(||melu||)
sĕkkaliṭṭĕ nŏkkevu śhirasiṭṭĕ duvvevu
sakkam̐danamulu nī vĕṁchanā tŏlli
akkaradom̐ vŏdigevu āsalĕllām̐ jūsevu
yikkuvado valabulu yippuḍĕṟim̐gidivā

(||melu||)
kaṁdunalu sūbevu kām̐giḍu niṁchevu
pŏṁdulu yivĕllām̐ dalaboyavā tŏlli
aṁdi śhrīveṁkaḍeśhum̐ḍa aṁganam̐ gūḍidi viṭṭĕ
aṁdabuveḍugalu nem̐ḍaṭṭĕ yĕṟim̐gidivā