మేలు మే లీబుద్ది వుట్టె మేఁటివి నీకు
(॥పల్లవి॥)
మేలు మే లీబుద్ది వుట్టె మేఁటివి నీకు
మైలదీర మణుఁగాయ మంచిదాయఁ గాలము
(॥మేలు॥)
తగవెంచి నేఁడు దయదలఁచితిగా కిన్నాళ్లు
నగవులే కావా నీవు నవ్వేటివి
వెగటుగ నాపైఁ జేయి వేసితివిగా కిపుడు
మొగము చూచేదా కాదా ముట్టుదాని వలెను
(॥మేలు॥)
యేఁటికో కొంగువట్టితి విటమునుప లెల్లాను
మాటలే కావా సారె మాతో నాడేవి
కూటమికి నావద్దఁ గూచుంటివిగా కిపుడు
పోటి సరసాలే కావా పారుగాపె వినును
(॥మేలు॥)
కాఁగిట శ్రీ వేంకటేశ కలసితి విదె నాఁడు
దాఁగిలి ముచ్చులే కావా తగురతులు
చేఁగదేర మన్నించి చెక్కునొక్కితిగా కిపుడు
ఆఁగుకవుండే కాదా అప్పుడే నీ వలెను
(||pallavi||)
melu me lībuddi vuṭṭĕ mem̐ṭivi nīgu
mailadīra maṇum̐gāya maṁchidāyam̐ gālamu
(||melu||)
tagavĕṁchi nem̐ḍu dayadalam̐sidigā kinnāḽlu
nagavule kāvā nīvu navveḍivi
vĕgaḍuga nābaim̐ jeyi vesidivigā kibuḍu
mŏgamu sūsedā kādā muṭṭudāni valĕnu
(||melu||)
yem̐ṭigo kŏṁguvaṭṭidi viḍamunuba lĕllānu
māḍale kāvā sārĕ mādo nāḍevi
kūḍamigi nāvaddam̐ gūsuṁṭivigā kibuḍu
poḍi sarasāle kāvā pārugābĕ vinunu
(||melu||)
kām̐giḍa śhrī veṁkaḍeśha kalasidi vidĕ nām̐ḍu
dām̐gili muchchule kāvā taguradulu
sem̐gadera manniṁchi sĕkkunŏkkidigā kibuḍu
ām̐gugavuṁḍe kādā appuḍe nī valĕnu