మేలు లేదు తీలు లేదు మించీనిదే హరిమాయ
(॥పల్లవి॥)
మేలు లేదు తీలు లేదు మించీనిదే హరిమాయ
కాలమందే హరిఁ గంటి కైవల్య మొకటే
(॥పల్లవి॥)
సురలును జీవులె నసురలును జీవులె
ధర నిందుఁ బ్రకృతిభేదమే కాని
సురలకు స్వర్గ మసురలకు నరకము
పరగ నీరెంటిగతి పాపపణ్యములే
(॥మేలు॥)
పొలఁతులు జీవులే పురుషులు జీవులే
తలఁప భావభేదములే కాని
బలిమి స్వతంత్రముఁ బరతంత్ర మొకరికి
యెలమి విందులోఁ జెల్లే హీనాధికములే
(॥మేలు॥)
రాజులును జీవులే రాసిబంట్లు జీవులే
వోజతో సంపద చెల్లేదొకటే వేరు
సాజపు శ్రీవేంకటేశు శరణ మొక్కటే గతి
బాజుఁ గర్మ మొండొకటి బంధమోక్షములు
(||pallavi||)
melu ledu tīlu ledu miṁchīnide harimāya
kālamaṁde harim̐ gaṁṭi kaivalya mŏgaḍe
(||pallavi||)
suralunu jīvulĕ nasuralunu jīvulĕ
dhara niṁdum̐ brakṛtibhedame kāni
suralagu svarga masuralagu naragamu
paraga nīrĕṁṭigadi pābabaṇyamule
(||melu||)
pŏlam̐tulu jīvule puruṣhulu jīvule
talam̐pa bhāvabhedamule kāni
balimi svadaṁtramum̐ baradaṁtra mŏgarigi
yĕlami viṁdulom̐ jĕlle hīnādhigamule
(||melu||)
rājulunu jīvule rāsibaṁṭlu jīvule
vojado saṁpada sĕlledŏgaḍe veru
sājabu śhrīveṁkaḍeśhu śharaṇa mŏkkaḍe gadi
bājum̐ garma mŏṁḍŏgaḍi baṁdhamokṣhamulu