Melu galide nimdugu mechchavaddaa neevitte

మేలు గలితే నిందుకు మెచ్చవద్దా నీవిట్టె
Language

(॥పల్లవి॥)
మేలు గలితే నిందుకు మెచ్చవద్దా నీవిట్టె
యీ లేమతో జాణతనా లెంతాశాడేవయ్యా

(॥మేలు॥)
కలికితనాలనే కరఁగించె నీమనసు
చిలుకుఁ జూపుల నిన్నుఁ జిమ్మిరేఁచెను
నిలువుఁ గొలుపు సేసి నిన్ను మరిగించుకొనె
చెలితో నీవెట్టు సాముసేసేవయ్యా

(॥మేలు॥)
నవ్వుతానే నీతోడ ననుపులు సేసుకొనె
వువ్విళ్ళూర మాఁటాడి వొడఁబరచె
వివ్వటిల్లఁ గళలంటి నిన్ను నిట్టె దక్కఁగొనె
జవ్వని నీవెటువలె సాదించేవయ్యా

(॥మేలు॥)
చుట్టరికముననే చొక్కులఁ బెట్టె నిన్ను
గుట్టుతోనే రప్పించుకొనె నింటికి
గట్టిగా శ్రీవేంకటేశ కందువఁ బెండ్లాడె నీతో
నిట్టి యలమేలుమంగ నెట్టు గెలిచేవయ్యా

(||pallavi||)
melu galide niṁdugu mĕchchavaddā nīviṭṭĕ
yī lemado jāṇadanā lĕṁtāśhāḍevayyā

(||melu||)
kaligidanālane karam̐giṁchĕ nīmanasu
silugum̐ jūbula ninnum̐ jimmirem̐sĕnu
niluvum̐ gŏlubu sesi ninnu marigiṁchugŏnĕ
sĕlido nīvĕṭṭu sāmusesevayyā

(||melu||)
navvudāne nīdoḍa nanubulu sesugŏnĕ
vuvviḽḽūra mām̐ṭāḍi vŏḍam̐barasĕ
vivvaḍillam̐ gaḽalaṁṭi ninnu niṭṭĕ dakkam̐gŏnĕ
javvani nīvĕḍuvalĕ sādiṁchevayyā

(||melu||)
suṭṭarigamunane sŏkkulam̐ bĕṭṭĕ ninnu
guṭṭudone rappiṁchugŏnĕ niṁṭigi
gaṭṭigā śhrīveṁkaḍeśha kaṁduvam̐ bĕṁḍlāḍĕ nīdo
niṭṭi yalamelumaṁga nĕṭṭu gĕlisevayyā