Melu galasodam gaani mettam badavu maa

మేలు గలచోటఁ గాని మెత్తఁ బడవు మా
Language

(॥పల్లవి॥)
మేలు గలచోటఁ గాని మెత్తఁ బడవు మా-
కాలు దాఁకినంతలోనే కసరేవు నీవు

(॥మేలు॥)
మంచముపై నుండే ఆపె మాటలాడఁగా నీవు
అంచెల దిగువ నుంటి వప్పుడే కాదా
యెంచఁగ మాతోనై తే యెమ్మెలెల్లఁ జేసి మా-
కంచముకూ డిందమంటే గబ్బితనా లాడేవు

(॥మేలు॥)
జలక మాడుచు నాపె సారెఁ బనులు చెప్పఁగ
అలరి యాపెకుఁ జీర లందియ్యవా
పలుకుల నేనైతేఁ బచ్చితిట్టు దిట్టితేను
వలసినట్ల నాతో వాదు లడిచేవు

(॥మేలు॥)
దవ్వులనుండి యాపె తమ్ముల ముమియఁ బోతే
చివ్వన నీవు దగ్గరి చేయి చాఁచేవు
రవ్వగా శ్రీవేంకటేశ రతి నన్నుఁ గూడితివి
నివ్వటిల్లి మొక్కుమంటే నే నోప ననేవు

(||pallavi||)
melu galasoḍam̐ gāni mĕttam̐ baḍavu mā-
kālu dām̐kinaṁtalone kasarevu nīvu

(||melu||)
maṁchamubai nuṁḍe ābĕ māḍalāḍam̐gā nīvu
aṁchĕla diguva nuṁṭi vappuḍe kādā
yĕṁcham̐ga mādonai te yĕmmĕlĕllam̐ jesi mā-
kaṁchamugū ḍiṁdamaṁṭe gabbidanā lāḍevu

(||melu||)
jalaga māḍusu nābĕ sārĕm̐ banulu sĕppam̐ga
alari yābĕgum̐ jīra laṁdiyyavā
palugula nenaidem̐ bachchidiṭṭu diṭṭidenu
valasinaṭla nādo vādu laḍisevu

(||melu||)
davvulanuṁḍi yābĕ tammula mumiyam̐ bode
sivvana nīvu daggari seyi sām̐sevu
ravvagā śhrīveṁkaḍeśha radi nannum̐ gūḍidivi
nivvaḍilli mŏkkumaṁṭe ne noba nanevu