(॥పల్లవి॥)
మేలు గలంతాను మెరసేను
తాలిమితో నిట్టే మా దండకు రావయ్యా
(॥మేలు॥)
మనసొక్కటాయ నింక మామాట వింటివి
ననుపై నాసెలవికి నవ్వువచ్చెను
చెనకఁగానే నాకు చేయి మీఁదాయ నేఁడు
తనిసితి మింకాను మాదండకు రావయ్యా
(॥మేలు॥)
చలమెల్ల నీడేరె చనవు మాకిచ్చితివి
కళలు నా మోమునఁ గడు నిండెను
కొలువులో నుండఁగానే కూటములు దైవారె
తలకొని యిపుడు మాదండకు రావయ్యా
(॥మేలు॥)
నిండెను సంతోసము నెమ్మది నన్నేలితివి
మెండుగ శ్రీవేంకటేశ మెచ్చితి నిన్ను
పండుమోవితేనెతోనే ఫలమందె రతులెల్లా
దండియై యున్నాఁడవు మాదండకు రావయ్యా
(||pallavi||)
melu galaṁtānu mĕrasenu
tālimido niṭṭe mā daṁḍagu rāvayyā
(||melu||)
manasŏkkaḍāya niṁka māmāḍa viṁṭivi
nanubai nāsĕlavigi navvuvachchĕnu
sĕnagam̐gāne nāgu seyi mīm̐dāya nem̐ḍu
tanisidi miṁkānu mādaṁḍagu rāvayyā
(||melu||)
salamĕlla nīḍerĕ sanavu māgichchidivi
kaḽalu nā momunam̐ gaḍu niṁḍĕnu
kŏluvulo nuṁḍam̐gāne kūḍamulu daivārĕ
talagŏni yibuḍu mādaṁḍagu rāvayyā
(||melu||)
niṁḍĕnu saṁtosamu nĕmmadi nannelidivi
mĕṁḍuga śhrīveṁkaḍeśha mĕchchidi ninnu
paṁḍumovidenĕdone phalamaṁdĕ radulĕllā
daṁḍiyai yunnām̐ḍavu mādaṁḍagu rāvayyā