మేలు గాదా నీ భాగ్యము మెఱసె నిందరిలోనా
(॥పల్లవి॥)
మేలు గాదా నీ భాగ్యము మెఱసె నిందరిలోనా
యేలుకోరయ్యా మమ్ము నిట్లానే ఇంకను
(॥॥)
సిగ్గులెల్లా మూటగట్టి చెలి నీపై వేసినట్టు
వొగ్గి నీపై వేసెఁ బువ్వులు చెండున
అగ్గపు మరుసాముల నాయము దాఁకించినట్టు
సగ్గక పెనఁగి నీమైఁ జన్నులఁ దానొత్తెను
(॥॥)
నవ్వులెల్లా నొక్కమాటే నాతి నీపై నించినట్టు
నివ్వట్టిల్లు గందవొడి నీపైఁ జల్లె
జవ్వనము రాసివోసి జాజరలాడినట్టు
చివ్వన సరసమాడి చెనకీని గోళ్లను
(॥॥)
వేవేలు తీపులతోడ విందు నీకుఁ బెట్టినట్టు
శ్రీవేంకటేశ ఆపె మోవి ఇచ్చెను
భావించి యలమేల్మంగ పట్టము గట్టుకొన్నట్టు
నీవురముపైఁ దానే నెలకొనె నిపుడు
(||pallavi||)
melu gādā nī bhāgyamu mĕṟasĕ niṁdarilonā
yelugorayyā mammu niṭlāne iṁkanu
(||||)
siggulĕllā mūḍagaṭṭi sĕli nībai vesinaṭṭu
vŏggi nībai vesĕm̐ buvvulu sĕṁḍuna
aggabu marusāmula nāyamu dām̐kiṁchinaṭṭu
saggaga pĕnam̐gi nīmaim̐ jannulam̐ dānŏttĕnu
(||||)
navvulĕllā nŏkkamāḍe nādi nībai niṁchinaṭṭu
nivvaṭṭillu gaṁdavŏḍi nībaim̐ jallĕ
javvanamu rāsivosi jājaralāḍinaṭṭu
sivvana sarasamāḍi sĕnagīni goḽlanu
(||||)
vevelu tībuladoḍa viṁdu nīgum̐ bĕṭṭinaṭṭu
śhrīveṁkaḍeśha ābĕ movi ichchĕnu
bhāviṁchi yalamelmaṁga paṭṭamu gaṭṭugŏnnaṭṭu
nīvuramubaim̐ dāne nĕlagŏnĕ nibuḍu