మెల్లనె మెల్లనె వచ్చి మేర మీరేవు
(॥పల్లవి॥)
మెల్లనె మెల్లనె వచ్చి మేర మీరేవు
చెల్లునంటా గొల్లెతలఁ జేకొంటిగా వోరి
(॥మెల్ల॥)
తొలుతనే నీవు నన్ను తొంగలిచూపులఁ జూచి
పలికిం చెప్పటిఁ జేయ పయి వేసేవు
బలువుఁడవు గనక పాయపువారి నిందరి
చెలఁగి కన్నెరికాలు చేకొంటిగా వోరి
(॥మెల్ల॥)
వచ్చి వచ్చి నవ్వు వవ్వి వలపులు నాకు రేఁచి
పచ్చిగాఁగ నాకొంగు పట్టఁ జూచేవు
హెచ్చి వువ్నాఁడవుగన యెఱఁగని వారిని
చెచ్చెర లోనుసేయక చేకొంటిగా వోరి
(॥మెల్ల॥)
పెరరేఁచి నామీఁదఁ బ్రియములు చల్లి చల్లి
కరఁగించి నన్నుఁగూడి కాఁగిలించితి
అరిది శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
సిరుల నందరి నిట్టె చేకొంటిగా వోరీ
(||pallavi||)
mĕllanĕ mĕllanĕ vachchi mera mīrevu
sĕllunaṁṭā gŏllĕdalam̐ jegŏṁṭigā vori
(||mĕlla||)
tŏludane nīvu nannu tŏṁgalisūbulam̐ jūsi
paligiṁ sĕppaḍim̐ jeya payi vesevu
baluvum̐ḍavu ganaga pāyabuvāri niṁdari
sĕlam̐gi kannĕrigālu segŏṁṭigā vori
(||mĕlla||)
vachchi vachchi navvu vavvi valabulu nāgu rem̐si
pachchigām̐ga nāgŏṁgu paṭṭam̐ jūsevu
hĕchchi vuvnām̐ḍavugana yĕṟam̐gani vārini
sĕchchĕra lonuseyaga segŏṁṭigā vori
(||mĕlla||)
pĕrarem̐si nāmīm̐dam̐ briyamulu salli salli
karam̐giṁchi nannum̐gūḍi kām̐giliṁchidi
aridi śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
sirula naṁdari niṭṭĕ segŏṁṭigā vorī