Mele yinniyunu naameemda mompevu

మేలే యిన్నియును నామీఁద మోఁపేవు
Language

(॥పల్లవి॥)
మేలే యిన్నియును నామీఁద మోఁపేవు
వాలాయించి నిన్ను మోచి వచ్చినవె కావా

(॥మేలే॥)
చెక్కు లేల చెమరించెఁ జెలియా
అక్కడ నీపతి కడ కంపఁగానే పో
పొక్కీ నేలే నీమోవి పొలఁతి
నిక్కి వేఁడిమాట లెల్లా నీ వాడు మనవా

(॥మేలే॥)
కన్ను లేల యఱ్ఱనాయ కలికి
పన్ని కస్తూరి నాచేతఁ బతి కంపవా
మిన్నక బుసకొట్ల మెఱసే వేలే
యిన్నిటా నాతనికడ కెడతాఁకించఁగఁబో

(॥మేలే॥)
కొప్పేల వెడ జాఱెఁ గోమలి
ముప్పిరి నీ వతనికి మొక్కు మనవా
యిప్పు డబ్బే శ్రీవేంకటేశు పొందులే
అప్పుడే నీవల్ల నాకు నందెనే యిన్నియును

(||pallavi||)
mele yinniyunu nāmīm̐da mom̐pevu
vālāyiṁchi ninnu mosi vachchinavĕ kāvā

(||mele||)
sĕkku lela sĕmariṁchĕm̐ jĕliyā
akkaḍa nībadi kaḍa kaṁpam̐gāne po
pŏkkī nele nīmovi pŏlam̐ti
nikki vem̐ḍimāḍa lĕllā nī vāḍu manavā

(||mele||)
kannu lela yaṭranāya kaligi
panni kastūri nāsedam̐ badi kaṁpavā
minnaga busagŏṭla mĕṟase vele
yinniḍā nādanigaḍa kĕḍadām̐kiṁcham̐gam̐bo

(||mele||)
kŏppela vĕḍa jāṟĕm̐ gomali
muppiri nī vadanigi mŏkku manavā
yippu ḍabbe śhrīveṁkaḍeśhu pŏṁdule
appuḍe nīvalla nāgu naṁdĕne yinniyunu