మేలే యెట్టుండినాను మేనవారము
(॥పల్లవి॥)
మేలే యెట్టుండినాను మేనవారము
జాలిఁబెట్టి నిన్ను మరి చండిసేసేనా
(॥మేలే॥)
కూరిమి గలితేఁజాలు కొసరితే నేమాయ
యేరా నీతోనే నెగ్గుపట్టేనా
గారవించితేఁజాలు కడనుంటే నేమాయ
రారా నిన్నంతేసి రవ్వసేసేనా
(॥మేలే॥)
కూడామాడా నుంటేఁజాలు గోరగీరితే నేమాయ
ఆడరా యేమైనామాట లవుఁగాదనేనా
వేడుక గలితేఁజాలు వెక్కసమైతేనేమాయ
పాడాదప్పకుర నీతో పంతమాడేనా
(॥మేలే॥)
నవ్వులు నవ్వితేఁజాలు నాలిసేసితే నేమాయ
జవ్వనమద మిదౌరా సాదించేనా
ఇవ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నివ్వటిల్లెరా మన్నవ నీకెదురాడేనా
(||pallavi||)
mele yĕṭṭuṁḍinānu menavāramu
jālim̐bĕṭṭi ninnu mari saṁḍisesenā
(||mele||)
kūrimi galidem̐jālu kŏsaride nemāya
yerā nīdone nĕggubaṭṭenā
gāraviṁchidem̐jālu kaḍanuṁṭe nemāya
rārā ninnaṁtesi ravvasesenā
(||mele||)
kūḍāmāḍā nuṁṭem̐jālu goragīride nemāya
āḍarā yemaināmāḍa lavum̐gādanenā
veḍuga galidem̐jālu vĕkkasamaidenemāya
pāḍādappagura nīdo paṁtamāḍenā
(||mele||)
navvulu navvidem̐jālu nāliseside nemāya
javvanamada midaurā sādiṁchenā
ivvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nivvaḍillĕrā mannava nīgĕdurāḍenā