(॥పల్లవి॥)
మేలే చెలియా మేలుగాల మిది
తాలిమి లేదిదె తతిపో నాకు
(॥మేలే॥)
వెన్నెల గాసీ వెలఁది నేఁడిపుడు
పున్నమిచంద్రుఁడు పొడచెనటే
కన్నెకోవిలలకలకల మయ్యీ
వన్నెవసంతము వచ్చెనటే
(॥మేలే॥)
కడఁగి చక్రవాకంబులు మూఁగీ
పుడమిఁ బొద్దిపుడు పొడచెనటే
ముడివడి చకోరములు కడుఁ బొలసీ
అడరి సందెవేళాయనటే
(॥మేలే॥)
చినుకులు రాలీ చిత్తజునెండల
కనుఁగొన వానలకాలమటే
యెనసితి శ్రీవేంకటేశుఁడ నే నిటు
వనిత నీరతికి వరుసిది యటవే
(||pallavi||)
mele sĕliyā melugāla midi
tālimi ledidĕ tadibo nāgu
(||mele||)
vĕnnĕla gāsī vĕlam̐di nem̐ḍibuḍu
punnamisaṁdrum̐ḍu pŏḍasĕnaḍe
kannĕgovilalagalagala mayyī
vannĕvasaṁtamu vachchĕnaḍe
(||mele||)
kaḍam̐gi sakravāgaṁbulu mūm̐gī
puḍamim̐ bŏddibuḍu pŏḍasĕnaḍe
muḍivaḍi sagoramulu kaḍum̐ bŏlasī
aḍari saṁdĕveḽāyanaḍe
(||mele||)
sinugulu rālī sittajunĕṁḍala
kanum̐gŏna vānalagālamaḍe
yĕnasidi śhrīveṁkaḍeśhum̐ḍa ne niḍu
vanida nīradigi varusidi yaḍave